
మెదక్, డిసెంబర్ 16: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సం ఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు సమస్యలను వివరించారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
మెదక్ పట్టణంతో పాటు మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. రూ.కోటి విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మెదక్ మండలంలో 36 మంది లబ్ధిదారులకు, పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 64 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, ఎంపీపీ జయనజయరాంరెడ్డి, మెదక్ పట్టణం, మెదక్, పాపన్నపేట, హవేళీఘనపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగాధర్, అంజాగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, వసంత్‌రాజ్, సుం కయ్య, మెదక్ మండలం సర్పంచలు ప్రభాకర్, రజని భిక్షపతి, నర్సింహులు, జానకీరాంరెడ్డి, ఎంపీటీసీలు ప్ర భాకర్, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, శ్రీధర్‌యాదవ్, దుర్గాప్రసాద్, ప్రవీణ్‌గౌడ్, మధుసూదన్‌రావు, సుమన్, కిషన్, ఉమర్, మధు, రా ములు, ఎలక్షన్‌రెడ్డి, వెంకట్, నవీన్, శ్రీనివాస్, భిక్షపతి, రవి, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన సీడీపీవో
మెదక్ రూరల్,డిసెంబర్16: మెదక్ ఐసీడీఎస్ సీడీపీవోగా బాధ్యతలు చేపట్టిన భార్గవి గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.