చొప్పదండి, డిసెంబర్ 31: ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో రూ.కోటీ 40 లక్షలతో చేపట్టిన కూరగాయల మార్కెట్, కుడి చెరువు వద్ద పార్కు, మల్లన్న గుట్ట వద్ద డంప్‌యార్డు, వైకుంఠధామం, ఆర్నకొండలో మాల సం ఘ భవనం, వైకుంఠధామ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఆర్నకొండలో నిర్వహించిన ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
మండలకేంద్రంలోని జూనియర్ కళాశాలలో శ్రీనివాస్ మె మోరియల్ ట్రస్ట్ తరఫున ఇంటర్ ఫస్టియర్ మ్యాథ్స్, బయో లజీ, కామర్స్, హిస్టరీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె నగదు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కొత్త గంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, సర్పంచులు దామెర విద్యాసాగర్‌రెడ్డి, గుంట రవి, కౌన్సిలర్లు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు మచ్చ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ట్రస్ట్ కన్వీనర్, తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు నలుమాచు హరిప్రసాద్, ఇన్చార్జి హెచ్ఎం కనకయ్య, ట్రస్ట్ సభ్యులు ఐలయ్య, శ్రీనివాస్, భరణి, రాజమౌళి, మనోహరస్వామి, శోభన్, సబితారాణి తదితరులు పాల్గొన్నారు.