ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (ఆర్సీయూఈఎస్) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఎం. కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఈ కేంద్రం వివిధ రాష్ట్రాలకు చెందిన పురపాలకశాఖ అధికారులకు శిక్షణను సైతం అందజేస్తుంది.
సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.కుమార్ గతంలో విభాగం హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్, ఓయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
పట్టణ రవాణా, ప్రణాళిక విభాగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ కుమార్ రూపొందించిన పలు పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో సైతం ప్రచురితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ అందించే బెస్ట్ ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను 2018లో సాధించారు.
ఆర్సీయూఈఎస్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు, కేంద్రం నిర్వర్తించే పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ప్రతిష్టను మరింత పెంపొందించి, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులు, ఉద్యోగులు అభినందించారు.