ఆర్కేపురం : హయత్‌నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్‌నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాస్ తెలిపారు.
33బై11 కేవీ హయత్‌నగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 2 వరకు లెక్చరర్ కాలనీ, వినాయకనగర్, ఓల్డ్ హయత్‌నగర్, ఎల్ఐసీ కాలనీ, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, ఫాతిమనగర్, శాతవాహన టౌన్షిప్, ప్రభుత్వ పాఠశాల, డీర్ పార్కు, బాలాజీనగర్, ఎల్లారెడ్డి కాలనీ, కె.వి.ఎన్.రెడ్డినగర్, రాజరాజేశ్వరి కాలనీ, కల్వంచ, శాంతినగర్, శారదనగర్, రాఘవేంద్ర కాలనీ, అరుణోదయ కాలనీ, భాగ్యతల హైస్కూల్, హైకోర్టు కాలనీ ప్రాంతాలు విద్యుత్ ఉండదు.
ఎల్బీనగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సరస్వతీనగర్, చింతలకుంట ప్రాంతాలు, సిరీస్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు సెంట్రల్ బ్యాంక్ కాలనీ, సూర్యోదయ కాలనీ, సరస్వతీనగర్, మధురనగర్, హాకీమాబాద్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
సౌంత్ఎండ్ పార్కు ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు సౌత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్ ఓల్డ్ విలేజ్, శైలజపురి, సెవన్‌హిల్స్ కాలనీ ప్రాంతాలు, మన్సూరాబాద్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు చిత్రసీమ కాలనీ, వివేకానందనగర్, బాలాజీనగర్, శ్రీరామహిల్స్, గణేశ్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.
శ్రీనివాస కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాలు, ఫణిగిరి కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఫణిగిరి కాలనీ, లక్ష్మీనర్సింహ దేవాలయం రోడ్డు, సాయిబాబా ఆలయం రోడ్డు, తెలంగాణ చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
విద్యుత్‌నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు లక్ష్మీనగర్,ఎస్బీఐ కాలనీ, ఓమ్ని హాస్పిటల్, కొత్తపేట ప్రధాన రహదారి పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేయనున్నుట్లు అధికారులు తెలిపారు.