కందుకూరు : నేటి ఆధునిక ప్రపంచంలో దూరాలోచనలకు దూరంగా ఉండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో ఆధ్యాత్మికతకు చేరువకావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అన్ని పండగలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడికి భక్తులు చేరువచేయడానికి భక్తి పరమైన పూజలు నిర్వహించేందుకు సహకారాలు అందజేయడం గోప్ప విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ప్రజలందరూ భక్తిని అలవర్చుకొని ప్రశాంతమైన జీవితం గడిపేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వారిని నిర్వాహకులు సన్మానించారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాప్పాటి పాండురంగారెడ్డి,మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి,డైరెక్టర్లు ఆనంద్, శేఖర్‌రెడ్డి, సర్పంచ్ యాలాల శ్రీనివాస్,ఎంపీటీసీ సురేష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జయేందర్, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు బాలమల్లేష్, ఆనేగౌని అంజయ్యగౌడ్, మూల హన్మంత్‌రెడ్డి,రమేష్, పర్వతాలు,నిర్వాహకులు పాల్గొన్నారు.