
రాజాపేట, జనవరి 7 : మండలంలో రైతుబంధు ఉత్సవాలు శుక్రవారం కొనసాగాయి. బేగంపేటలో రైతుబంధు, కేసీఆర్ అక్షరామాలలు పేర్చగా, పొలంలో ట్రాక్టర్ ప్రదర్శన నిర్వహించారు. పుట్టెగూడెంలో పత్తి చేనులో గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటాలు చేతబూని సంబురాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచులు దేవీరాములునాయక్, కరుణాకర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, యువజన అధ్యక్షుడు పల్లె సంతోశ్‌గౌడ్, కోశాధికారి కటకం స్వామి, ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, నాయకులు సట్టు తిరుమలేశ్, ఎర్రగోకుల జశ్వంత్, బెడిద వీరేశం, మాడోతు లక్ష్మణ్‌నాయక్, రాణినాయక్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : వంగపల్లిలో రైతులు పొలంలో నారుతో కేసీఆర్ పేరును పేర్చారు. చొల్లేరులో రైతుబంధు నిధులను ముగ్గుల రూపంలో వేసి అభిమానాన్ని చాటుకున్నారు. మాసాయిపేటలో ర్యాలీ నిర్వహించారు. జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచులు వంటేరు సువర్ణ, తోటకూరి బీరయ్య, ఏఈఓలు మనీషా, శ్రావ్య, నాయకులు భాస్కర్, దేవేందర్, మహేశ్, అజ్జూ, హబీబ్, రఘువరణ్ పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరు రూరల్ : విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మరికొన్ని గ్రామాల్లో రైతు వేదికలను అలంకరించారు. కార్యక్రమంలో ఏఈఓలు నాగార్జున, శివకుమర్, పవన్, సోని, నాయకులు మహేందర్, రాంనర్సయ్య, పర్వతాలు, కిష్టయ్య, వెంకటపాపిరెడ్డి, శ్రీధర్, శోభన్‌బాబు, అశోక్ పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : పలు గ్రామాల్లో వేడుకలు జరిగాయి. మాదాపురం, మోతీరాంతండాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు జాలిగాం కృష్ణ, మాజీ సర్పంచ్ హరినాయక్, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : బొమ్మలరామారం, చీకటిమామిడి, మైలారంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి జేజేలు పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రాల లక్ష్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు కుక్కదువ్వు ఉపేందర్, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, నాయకులు పోషంరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, పాపిరెడ్డి, రామకృష్ణ, రాజు, రమేశ్, శాంతాచారి పాల్గొన్నారు.
చౌటుప్పల్ మండలంలో..
చౌటుప్పల్ రూరల్ : నేలపట్లలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కప్పల శ్రీనివాస్‌గౌడ్, పబ్బతి ఆంజనేయులుగౌడ్, బుట్టి శ్రీనివాస్, పబ్బతి వెంకటయ్య, గంగాపురం నగేశ్‌గౌడ్, చిన్నం బాలరాజు పాల్గొన్నారు.
బీబీనగర్ మండలంలో..
బీబీనగర్ : బ్రాహ్మణపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గూడూరు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్, అమరేందర్, నర్సింహారెడ్డి, సత్తిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
వలిగండ మండలం పులిగిల్లలో..
వలిగొండ : పులిగిల్లలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, సర్పంచ్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీటీసీ బండారు ఎల్లయ్య, ఉప సర్పంచ్ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు డేగల పాండరి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రత్నయ్య, పైళ్ల మల్లారెడ్డి, ఏఈఓ పావని పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎం)మండలంలో..
ఆత్మకూరు(ఎం) : అన్ని గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతోపాటు టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. గ్రామ గ్రామాన ఎడ్ల బండ్లతోపాటు ట్రాక్టర్లతో ఊరేగింపు చేశారు. రాఘవాపురానికి చెందిన గొర్లకాపర్ల సంఘం అధ్యక్షుడు కాటం యాదయ్య తన టీవీఎస్ ఎక్సెల్‌కు రైతు బంధు వారోత్సవాల ప్రచార ఫ్లెక్సీతోపాటు టీఆర్ఎస్ జెండా కట్టుకొని గ్రామ గ్రామాన ప్రచారం చేపట్టాడు. ఉత్సవాల్లో భాగంగా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్ ఆధ్వర్యంలో ఆరుగురు రైతులను సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, సెక్రటరీ జనరల్ యాస రంగారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్లు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్లు నాతి రాజు, స్వామి పాల్గొన్నారు.
రామన్నపేట మండలంలో..
రామన్నపేట : మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయ ఆవరణ, జనంపల్లిలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ముగ్గులు, మామిడి ఆకులు, కొబ్బరి మట్టలతో అలకరించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలభిషేకం చేశారు. రైతులకు స్వీట్లు పంచి వారిని సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు పిట్ట విజయ్‌రెడ్డి, నక్క యాదయ్య, కన్నెకంటి వెంకటేశ్వరాచారి, నాగు అంజయ్య, సర్పంచ్ రేఖ యాదయ్య, ఎంపీటీసీ దోమల సతీశ్, సీఈఓ జంగారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, కార్యదర్శి పోచబోయిన మల్లేశం, నాయకుల ఆమేర్, కంభంపాటి శ్రీనివాస్, మాధవరెడ్డి, బొడ్డు అల్లయ్య, సంతోష్, ప్రసాద్, అస్లాం బేగ్, మీర్జా ఇనాయతుల్లాబేగ్ పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలో..
మోత్కూరు : పలు పాఠశాలల్లో విద్యార్థులు ముగ్గులు వేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో, సహకార సంఘంలో రైతులను సన్మానించారు. శాఖా గ్రంథాలయంలో వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పాటిమట్ల, అనాజిపురంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీరెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోశ్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు రమేశ్, కళ్యాణ్ చక్రవర్తి, రైతు బంధు సమితి మండల కో అర్డినేటర్ కొండ సోంమల్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, సామ పద్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల : బ్రాహ్మణపల్లి రైతువేదిక వద్ద ముగ్గులు వేశారు. వెల్మజాలలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఖలీల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పాండరి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, సర్పంచులు సంధ్య, బాలకృష్ణ, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, రాములు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు దయాకర్, చెన్నారెడ్డి, శ్రీనివాస్, బాలకొమురయ్య, రామచంద్రు, బాలమల్లు, పాండు, నాగరాజు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం మండలంలో..
సంస్థాన్ నారాయణపురం : జనగాంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి, సర్పంచ్ కురిమిద్దె కళమ్మ, ఉప సర్పంచ్ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ రాములమ్మ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యాదిరెడ్డి, ఏఓ ఉమారాణి, ఏఈఓ అరుణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మోటకొండూరులో..
యాదాద్రి : మోటకొండూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూమండ్ల అయిలయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య, గ్రామ కన్వీనర్ నర్సింహారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, రైతులు వీరమల్లేశ్, బంగారురెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు నర్సింహులుయాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.