
దమ్మపేట, జనవరి 8: దమ్మపేట, పట్వారిగూడెం గ్రామాల్లో శనివారం రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత పట్వారిగూడెం రైతువేదిక వద్ద ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. రైతువేదికలో ధాన్యపు గింజలతో వేసిన నాగలి, రైతుబంధు సంబురాల అక్షరమాలికను పరిశీలించారు. అనంతరం దమ్మపేట ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే మెచ్చా పరిశీలించి వారిని అభినందించారు. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ ప్రసాద్, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు, సర్పంచ్, ఉపసర్పంచ్ చిన్నవెంకటేశ్వరరావు, యుగంధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు, రాష్ట్ర పామాయిల్ సంఘం అధ్యక్షుడు రామచంద్రప్రసాద్, ఏడీ అఫ్జల్‌బేగం, ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈవో దీప్తి, పంచాయతీ ప్రత్యేక అధికారి రమేశ్, ఎంఈవో లక్ష్మి, ఉమామహేశ్వరరావు, కోటేశ్వరరావు, కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), సొసైటీ చైర్మన్ జోగేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు గోపి, ఏఎంసీ వైస్ చైర్మన్ అచ్యుతరావు, ప్రసాద్, నాగేశ్వరరావు, సాగర్, హెచ్ఎం మస్తాన్అలీ పాల్గొన్నారు.
చండ్రుగొండ, జనవరి 8: తెలంగాణ విత్తన ధాన్యాగారంగా దేశంలో గుర్తింపు తెచ్చుకున్నదని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం రైతువేదికలో ఉత్తమ రైతులు శ్రీనివాస్‌రావు, రమేశ్, నరేశ్‌ను శాలువాలతో సన్మానించారు. ఏవో నవీన్‌బాబు, ఎంపీపీ బానోత్ పార్వతి, గానుగపాడు సొసైటి చైర్మన్ చందర్రావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రసూల్, సర్పంచ్‌లు లక్ష్మిభవానీ, రన్య, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, మండల కోఆర్డినేటర్ లింగయ్య, సొసైటీ డైరక్టర్లు నాగరాజు, రాందాసు, నాయకులు వెంకయ్య, మోహన్‌రావు, శేఖర్, రమేశ్, శ్రీనివాస్‌రావు, బీలు, రాములు, వెంకటేశ్వరరావు, బాబురావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ములకలపల్లి, జనవరి 8: మండలంలో రైతుబంధు సంబరాలను శనివారం నిర్వహించారు. ములకలపల్లి రైతువేదిక వద్ద ఉత్తమ రైతు గాదె తిరుపతిరెడ్డిని ఎంపీపీ మట్ల నాగమణి సన్మానించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మెహరామణి, టీఆర్ఎస్ కార్యదర్శి అంజి, సీతారాములు, సర్పంచ్‌లు భద్రం, గొల్ల పెంటయ్య, సుధాకర్, దుగ్గి సంపత్‌కుమార్, శివ, గణపతి పాల్గొన్నారు.
ములకలపల్లి, జనవరి 8: మండల పరిధిలోని రామచంద్రాపురంలో సర్పంచ్ సున్నం సుధాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కృష్ణారావు, జుబ్బురు అక్కులు, మండల ఉపాధ్యక్షుడు లింగయ్య పాల్గొన్నారు.
ఇల్లెందు, జనవరి 8: అన్నదాత ఆనందాలకు అవధుల్లేవని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పులిగండ్ల మాధవరావు అన్నారు. శనివారం రొంపేడు పంచాయతీలో ఆత్మ చైర్మన్ భావ్‌సింగ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ డైరెక్టర్ హనుమాన్, అజ్మీర దేవల, హరి, వేణుకుమార్, రాజ్‌కుమార్, బాల రాంబాబు, మోహన్, ఏఈవో యశ్వంత్, రామచంద్ర, ఎర్రయ్య, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట రూరల్, జనవరి 8: రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని రైతుబంధు మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అన్నారు. శనివారం మండలంలోని తిరుమలకుంట కాలనీలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సంబురాలు నిర్వహించారు. అనంతరం ముగ్గురు ఉత్తమ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఏవో నవీన్, ఏఈవో రాజేశ్వరరావు, షాకీరాబాను, రాయుడు, సర్పంచ్‌లు సున్నం సరస్వతి, కె లింగయ్య, ఎంపీటీసీ నాగలక్ష్మి, రైతులు రామలక్ష్మయ్య, పల్లేల వెంకన్నబాబు, జుజ్జూరి, మనోహర్, ఉపసర్పంచ్ రాంబాబు, రైతుబంధు గ్రామ కన్వీనర్లు పాల్గొన్నారు.