
నిజాంపేట,డిసెంబర్16: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ,సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు.గురువారం నిజాంపేటలోని హనుమాన్ ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్యర్యంలో నిర్వహించిన స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొ న్నారు.అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ,నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ను అయ్యప్ప సేవా సమితి సభ్యులు సన్మానించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఇటీవల చిట్టాపూర్‌లో కారు బావిలో పడి మృత్యువాత పడ్డ నందిగామాకు చెందిన తల్లి కొడుకులు భాగ్యలక్ష్మి, ప్రశాంత్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ,సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అండగా నిలుస్తామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, నందగామ సర్పంచ్, ఎంపీటీసీ ప్రీతి, సురేశ్, నార్లపూర్ ఎంపీటీసీ, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, సంజీవ్, చల్మెడ ఉపసర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, తిరుపతి,సిద్ధిరాంరెడ్డి,సంగుస్వామి, స్వామి,నాగరాజు, రమేశ్, బాబు, రవితేజ, కాళిదాసు తదితరులు ఉన్నారు.