
ఖమ్మం/ రఘునాథపాలెం, డిసెంబర్ 30: అభివృద్ధిలో రఘునాథపాలెం మండలాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గతంలో ఇచ్చిన హామీ మేరకు మండలంలోని వేపకుంట్ల మొండికుంట చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే పనులకు గురువారం మంత్రి అజయ్‌కుమార్ శంకుస్థాపన పనులు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేందుకు గ్రామాలకు ఆనుకొని ఉన్న చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రఘునాథపాలెం మినీ ట్యాంక్‌బండ్‌ను మోడల్‌గా తీసుకొని వేపకుంట్ల ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ బాలసానిని అభినందించి శాలువాతో సత్కరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, వేపకుంట్ల సర్పంచ్ దారా శ్యాం, ఆత్మచైర్మన్ లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్‌లు మెంటెం రామారావు, బండి వెంకన్న, ఎంపీటీసీ ఉప్పెర్ల వనజారాణి, బండి నాగేశ్వరరావు, తాతా వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్ జంగాల శ్రీను, ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
డీవాటర్డ్ ఫ్లోరింగ్ రోడ్ల ప్రారంభం
నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగా అన్ని డివిజన్లలోనూ సీసీ రహదారులు నిర్మిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం నగరంలోని 10వ డివిజన్ చైతన్యనగర్, 18వ డివిజన్ శ్రీరాంహిల్స్లో కలిపి మొత్తం రూ.75.50 లక్షలతో నిర్మించిన వ్యాక్యుమ్ డీవాటర్డ్ ఫ్లోరింగ్ రోడ్లను మేయర్ నీరజతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.30 కోట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో నగరంలోని 41 డివిజన్లలో 140 రోడ్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు చావా మాధురి నారాయణరావు, మందడపు లక్ష్మీ మనోహర్‌రావు, కమర్తపు మురళి, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, తన్నీరు శోభారాణి, కొల్లు పద్మ, శ్రీరాంహిల్స్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరావు, తూములూరు ప్రసాద్, రామకృష్ణారెడ్డి, బండారు శ్రీనివాసరావు, మేడారపు శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.