కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 31: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టుల కట్టడి, గంజాయి-గుట్కాల నిర్మూలన, మహిళలకు భద్రత.. ఇలా ప్రతి అంశంలోనూ జిల్లా పోలీస్ శాఖ ఉత్తమం(బెస్ట్)గా నిలిచింది. మాదక ద్రవ్యాల నిర్మూలనలోనైతే రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది. ఈ వివరాలన్నీ ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. గడిచిన ఏడాదిలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేసిందని చెప్పారు. జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతి దొర్లకుండా ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. ఏడాది ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు, వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.
గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీ స్ యంత్రాంగం ఎంతో కృషి చేసింది. గంజాయి అదుపులో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 74 డ్ర గ్స్ కేసుల్లో 212 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 16,160 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు.