యాదాద్రి, జనవరి 9 : ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత్తున ఎండ్లబండ్లతో ర్యాలీలు తీయడంతో పాటు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. పల్లెపల్లెనా జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై రైతుబంధు అంటూ నినాదాలు చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట, చొల్లేరు, చిన్నకందుకూరు, మల్లాపురం, మాసాయిపేట, మోటకొండూర్ మండల కేంద్రంతో పాటు, చాడ, ముత్తిరెడ్డిగూడెం, నాంచారిపేట, కదిరేణిగూడెం, కొండాపూర్‌తో పాటు అన్ని గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. బాహుపేటలో సర్పంచ్ కుండె పద్మ, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆరె శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్వీ మండల సెక్రటరీ జనరల్ ఆరె ప్రశాంత్‌గౌడ్, నాంచారిపేటలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, సర్పంచ్ పైళ్ల వినోద, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంట్రామిరెడ్డి పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఆదివారం ఘనం గా నిర్వహించారు. కొలనుపాక గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి బహుమతులు అందించారు. పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి రైతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జంగస్వామి, మామిడాల అంజయ్య, తోడేటి నరేందర్, గుర్రాల బాలరాజు, జంగ పర్శరాములు, బాలనర్సయ్య, మధు, శ్రీనివాస్, రమేశ్, లక్ష్మి, అనిత పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ జక్కుల శ్రీవాణీవెంకటేశ్తో పాటు గ్రామస్తులు ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ముగ్గులు వేశారు. అదేవిధంగా గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీ తీసి సంబురాలు జరుపుకున్నారు. గంధమల్ల, చిన్నలక్ష్మాపురం, చోక్లాతండాల్లో ముగ్గులు వేయడంతో పాటు వ్యవసాయ క్షేత్రాల వద్ద సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ జ్యోతి, ఏఓ దుర్గేశ్వరి, సర్పంచ్‌లు శాగర్ల వాణీపరమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సరిత, భాస్కర్‌యాదవ్, మనోహర్‌రెడ్డి, జెల్ల వెంకటేశ్, సురేందర్, ఇస్తారి, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని చిన్నకొండూర్లో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో చెక్క శ్రీనివాస్, పగిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బోయిని నర్సింహయాదవ్, దోర్నాల సత్తిబాబు, కానుకుర్తి శివకుమార్, బండ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మరిపడిగ గ్రామం లో సీఎం ఫ్లెక్సీతో ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టారు. వెల్మజాల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ముగ్గులు వేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.ఖలీల్, రైతుబంధు సమితి కన్వీనర్ పాండరి, సర్పంచులు సంగి బాలకృష్ణ, దుంపల శ్రీనివాస్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓ సంతోషి, ఏఈఓ క్రాంతికుమార్, నాయకులు కోలుకొండ రాములు, బాలకొమురయ్య, నాగరాజు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు దయాకర్, అనంతుల శేఖర్, బాలమల్లు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ఎల్లగిరి గ్రామపంచాయతీ ఎదుట ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరరం పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలుయాదవ్, గ్రామస్తులు కందకట్ల వెంకట్రాంరెడ్డి, సుర్కంటి నాగరాజురెడ్డి, పద్మ, నవ్య పాల్గొన్నారు.
రాజాపేట : మండంలోని రైతు వేదికలో వృద్ధ రైతులను సన్మానించారు. జాల గ్రామంలో ర్యాలీ తీసి జై కేసీఆర్ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచ్ గుంటి మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు ఠాకూర్ ప్రమోద్‌సింగ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొన్యాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండంలలోని మల్యాల గ్రామ రైతులు పొలంలో నారుతో సీఎం కేసీఆర్ పేరు రాసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మైలారం నర్సింహ, బోనంకూర మల్లేశం, ఊట్ల రమేశ్, నాగేశ్, జెల్ల బాలనర్సింహ, గడ్డమీది రాజయ్య, శ్రీనివాస్, ఆంజనేయులు, భిక్షపతి, లకడబోయిన భాస్కర్, భుజంగం, స్వామి పాల్గొన్నారు.
అడ్డగూడూరు : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని చిర్రగూడూరు గ్రామ పంచాయతీలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతు బీమా పథకాలపై అవగహన కల్పించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిచారు. విజేతలకు సర్పంచ్ కమ్మంపాటి పరమేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.