Encounter | గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు, ఒక కమాండో మృతి
Encounter | మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) లో మరో ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నిన్న (గురువారం) ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక కమాండో కూడా ప్రాణాలు కోల్పోయారు.
Encounter : మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) లో మరో ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నిన్న (గురువారం) ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక కమాండో కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భమ్రాగడ్ తాలూకాలో గురువారం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇందులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌తోపాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీ-60 కమాండో దీపక్ చిన్న మాధవి (38) తీవ్రంగా గాయపడటంతో అతడిని హెలికాప్టర్లో భమ్రాగడ్‌లోని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో అధికారి కూడా గాయపడగా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

