– తుంగతుర్తి తాసీల్దార్కు రావులపల్లి సర్పంచ్ వినతి
తుంగతుర్తి, ఫిబ్రవరి 06 : తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ అభివృద్ధి సహకరించాలని శుక్రవారం గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రావులపల్లి గ్రామ పంచాయతీకి కేటాయించిన మినీ గోదాం, మహిళా శక్తి భవనం, పల్లె దవాఖాన నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించి ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అత్యంత అవసరమని, వీటి అమలుకు సంబంధిత అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.