పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. దండగ అన్న వ్యవసాయాన్ని రైతు బంధు పథకం పండుగ చేసింది. కర్షకులకు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. అప్పుల ఊబి నుంచి గట్టెక్కిచ్చింది. సాగుకు భరోసానిచ్చింది. ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం అందుకుని రైతులు దర్జాగా సాగుకు కదులుతున్నారు. ఈ పథకానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పథకం ఆరంభం నుంచి ఈ నెల 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ అవుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉభయ జిల్లాల్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం రూరల్ మండలంలో బెల్లం వేణు వేడుకల్లో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: రైతుబంధు రైతులకు వరమిచ్చింది. సాగుకు భరోసానిచ్చింది. ఎవుసాన్ని పండుగ చేసింది. పథకానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పథకం ఆరంభం నుంచి ఈ నెల 10 లోపు రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ అవుతున్న సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 10 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉభయ జిల్లాల్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలు..
వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం అన్ని పాఠశాల్లో విద్యార్థులకు 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నది. విద్యార్థులు ‘వ్యవసాయం,-ప్రాధాన్యత, రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత..’ అనే అంశంపై పోటీలు జరుగనున్నాయి. 8, 9 తేదీల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగనున్నాయి. చివరి రోజు 10వ తేదీన రైతువేదికల వద్ద రైతులతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నాయి. ఇదే రోజు ఎడ్లబండి ప్రదన్శనలు, వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరుగనున్నది.
ఖమ్మం జిల్లాలో రూ.2,661 కోట్లు..
ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్ వరకు రైతుల ఖాతాల్లో రూ.2,661 కోట్లు జమ అయ్యాయి. ఈ యాసంగి సీజన్‌కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి. సోమవారం వరకు 2,60,797 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.200.17 కోట్ల సొమ్ము జమ అయింది. మిగిలిన వారి ఖాతాల్లో ఈ నెల 10 లోపు రైతుబంధు జమ కానున్నది.
భద్రాద్రి కొత్తగూడెంలో రూ.1,507 కోట్లు
భద్రాద్రి జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రైతులకు రూ.1,507 కోట్ల రైతుబంధు సాయం అందింది. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 1,41,685 మంది రైతులకు సర్కార్ రూ.215 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు 1,12,950 మంది ఖాతాల్లో రూ.117 కోట్లు జమ అయ్యాయి. మిగిలిన 28,735 మంది బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 10లోపు జమకానున్నది.
రైతులకు మంచిరోజులు
ఖమ్మం రూరల్, జనవరి 3: టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు మంచిరోజులు వచ్చాయని రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు జమవుతున్న సందర్భంగా సోమవారం మండల పరిధిలోని మద్దివారిగూడెంలో గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధుతో రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పాయన్నారు. రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రైతుబంధు సమితి సభ్యుడు అక్కినపల్లి వెంకన్న, సర్పంచ్ అల్లం పద్మావతీమాధవరెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, రామయ్య, పుల్లారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కోటయ్య, పెద్ద సీతయ్య, యాకుబ్, వెంకటేశ్వర్లు, కరుణాకర్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఐదెకరాల్లోపు రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తి
ఖమ్మం వ్యవసాయం, జనవరి 3: ఐదెకరాల్లోపు పట్టా భూమి ఉన్న రైతుల బ్యాంకు అకౌంట్లలో యాసంగి సీజన్ రైతుబంధు పంటల పెట్టుబడి సాయం సొమ్ము జమ అయినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2,80,182 మంది రైతులకు గాను రూ.242.78 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఈ యాసంగి సీజన్‌కు గాను జిల్లా వ్యాప్తంగా 3,16,422 మంది రైతులకు రూ.362.84 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నెల10లోపు అర్హత కలిగిన మిగిలిన రైతులందరికీ విస్తీర్ణాలకు అనుగుణంగా జమ చేయనున్నట్లు వివరించారు.
రైతు బాంధవుడు కేసీఆర్ : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బూర్గంపహాడ్, జనవరి 3: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభు త్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మండలంలోని ఉప్పుసాకలో రైతులు, నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. రైతుబంధు పథకంతో సాగు పండుగైందన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌లు సిరిపురం స్వప్న, భూక్యా శ్రావణి, భారతి, సోంపాక నాగమణి, వెంకటేశ్వర్లు, కొర్సా లక్ష్మి, కొయ్యల పుల్లారావు పాల్గొన్నారు.
రైతుబంధుతో భరోసా..
నాకు 30 కుంటల పొలం ఉన్నది. రైతుబంధు రాకముందు భూమిని బీడుగా వదిలేశా. ఒకవేళ పండించినా నష్టాలే ఎదురయ్యేవి. అప్పు తెచ్చి సాగు చేస్తే వచ్చిన దిగుబడి వడ్డీకే సరిపోయేది. రైతుల బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. యాసంగికి నాకు రూ.2,500 అందాయి. ఎరువులు, మందులు కొన్నా. పత్తి సాగు చేస్తున్నా.
పాత అంజనాపురం, సుజాతనగర్ మండలం సకాలంలో సొమ్ము..
నాకు ఎకరా పొలం ఉంది. నా ఖాతాలో రూ.5 వేల రైతుబంధు జమ అవుతున్నది. వానకాలంలో వచ్చిన సొమ్ముతో మందులు, ఎరువులు కొన్నాను. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందుతుండడంతో సాగుకు ఇబ్బందులు తప్పాయి. ఎవరి సాయం లేకుండానే నేను పంట సాగు చేస్తున్నా. వానకాలంలో 28 క్వింటాళ్ల వడ్లు పండించా. తిండిగింజలు పోను మిగతా ధాన్యం విక్రయించా.