e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home కామారెడ్డి ఇతర పంటలపై దృష్టి సారించేలా..

ఇతర పంటలపై దృష్టి సారించేలా..

  • యాసంగి సీజన్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌
  • కామారెడ్డి జిల్లాలోని 104 క్లస్టర్లలో సాగుతున్న శిక్షణ కార్యక్రమాలు
  • 25-30 శాతం వరిసాగు తగ్గించే దిశగా చర్యలు
  • బైబ్యాక్‌ ఒప్పందం ఉంటేనే వేయాలని సూచన

సొంతిల్లు వారికి ఏండ్లనాటి కల. పేదరికంలో మగ్గుతూనే.. ఓ గూడు కోసం తపించారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, అన్ని వసతులతో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డబుల్‌ బెడ్‌రూం పథకం వారి కలను సాకారం చేసింది. వేల్పూర్‌ మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన 112 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. పండుగలా సాగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో లబ్ధిదారులు సంబురంగా కొత్తింటిలోకి అడుగుపెట్టారు. పాలు పొంగించి.. పూజలు నిర్వహించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

కామారెడ్డి, డిసెంబర్‌ 8 : యాసంగిలో ఇతర పంటల సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు అధికారు లు మరో సారి స్పెషల్‌డ్రైవ్‌ను ప్రారంభించారు. కేంద్రం యాసంగిలో వరి పంట సేకరణపై స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేయడంతో పాటు వరి వద్దంటూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యాసంగి పంటల సాగు కా లం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం రైతులను ఇతర పంటలవైపు మళ్లిస్తున్నది. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని ఎఫ్‌సీఐ స్పష్టం చేయడం, ఆ సమస్యను అధిగమించడానికి వరి పంట నియంత్రణ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి స్వయంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ రైతులను ఇతర పంటల వైపు ప్రోత్సహిస్తున్నారు. వారం రోజులుగా గ్రామాల్లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అప్రమత్తమైన యంత్రాంగం..

కామారెడ్డి జిల్లాలో ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రారంభించింది. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి ప్రాంతాల పరిధిలో యాసంగిలో పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 104 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరి పంట సాగును యాసంగిలో 25-30 శాతానికి తగ్గించే దిశగా కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రైతులకు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయశాఖ.. ప్రభుత్వం సూచించిన ఆదేశాలతో ఆప్రమత్తమైంది. వరికి బదులుగా ఏయే పంటలు వేయాలనే విషయాన్ని రైతులకు వివరిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ యాసంగిలో శనగ, గోధుమ, మినుములు, పెసర్లు, పొద్దుతిరుగుడు , ఆవాలు, జొన్నలు, మక్కజొన్న, కూరగాయలు, ధనియాలు, కుసుమలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయరంగానికి కీలకంగా ఉన్న జిల్లాల్లో కామారెడ్డి ఒకటి. ఈ ప్రాంతానికి అనుగుణంగా పంటలను సాగు చేసి, అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నారు. ఇతర పంటలు వేసుకోవడం, మద్దతు ధర సాధించడం, మార్కెట్‌ డిమాండ్‌ అంశాలను పరిగణలోకి తీసుకోని రైతులకు భరోసా కల్పిస్తున్నారు.

బై బ్యాక్‌ ఒప్పందం ఉంటేనే..

యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రైవేటు విత్తన కంపెనీలు, సీడ్‌ కార్పొరేషన్‌, ఇతర సంస్థలతో ఒప్పందం ఉన్న రైతులు మాత్రమే వరి పంట సాగు చేసుకోవచ్చనే విషయాన్ని రైతులకు వివరిస్తున్నారు. అదే విధంగా చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు వరి పంట సాగు చేయాలి తప్ప ఇతర భూముల్లో మాత్రం ఆరుతడి పంటలే మేలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నది. జిల్లాలో శనగ, మిను ము, పెసర, కంది, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలతో పాటు పప్పుధాన్యాల సాగే మేలంటున్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్‌ కార్పొరేషన్‌, విత్తన కంపెనీలు, ఆధీకృత డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు.

ఇతర పంటలే వేసుకోవాలి

యాసంగిలో రైతులు ఇతర పం టలు వేసుకోవాలి. వరికి బదులుగా పది రకాల పంటలను వేసుకోవడం ద్వారా రై తులకు మార్కెటింగ్‌కు ఇబ్బం ది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి రైతులు సహకరించాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. రైతులకు అవగాహన కల్పించే పుస్తకాలు, పోస్టర్లు, కరపత్రాలను గ్రామాల్లోకి పంపించాం.
-జితేశ్‌ వీ పాటిల్‌, కామారెడ్డి కలెక్టర్‌

ఎంతో ఆనందంగా ఉంది..

ఏండ్ల సంది అద్దె ఇండ్లళ్లనే ఉంటున్నం. మాకూ ఒక ఇల్లు ఉంటదని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు సొంతింటిలో అడుగు పెడుతుంటే మా ఆనందం అంతాఇంతా కాదు. డబుల్‌ బెడ్‌రూం స్కీంతో మా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement