భువనగిరి అర్బన్ / చౌటుప్పల్ / చౌటుప్పల్ రూరల్ / భువనగిరి కలెక్టరేట్ / వలిగొండ / రాజాపేట / ఆత్మకూరు(ఎం) / రామన్నపేట / గుండాల, జనవరి 5 : కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై, యారన్‌పై విధించిన 5శాతం జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు చేపట్టారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెంపు సరికాదని, వెంటనే పెంచిన జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని గాంధీపార్కు నుంచి పాత బస్టాండ్ వరకు చేనేత కార్మిక సంఘం నాయకులు ర్యాలీ తీశారు. అనంతరం తాసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తూరి భిక్షపతి, పట్టణాధ్యక్షుడు బల్ల రమేశ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి ఆంజనేయులు, భువనగిరి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు ఎలగందుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి గుజ్జ లింగం, నాయకులు శంకర్, యాదగిరి పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో హైండ్లూమ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వర్కాల శ్రీమన్నారాయణ, ఎంపీటీసీ జెల్ల ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్ మాచర్ల కృష్ణ, నాయకులు జెల్ల వెంకటేశం, జయశంకర్, గుర్రం వెంకటేశ్వర్లు, రవ్వ సంతోష్, కర్నాటి నారాయణ, గంజి మార్కండేయ, పొట్టబత్తిని హరేకృష్ణ పాల్గొన్నారు. చౌటుపల్ చేనేత సహకార సంఘం సభ్యులు ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు మున్సిపాలిటీ కేంద్ర ంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో నాయకులు కందగట్ల భిక్షపతి, గోశిక స్వామి, చిరందాసు ధనుంజయ్య, గోశిక రవి, పురుషోత్తం, ధనుంజయ్య పాల్గొన్నారు. చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి తొలగించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ఎస్.అమృతం, వి.లక్ష్మీనారాయణ, ఎస్.సత్తయ్య, బి.భిక్షపతి, ఆంజనేయులు ఉనారు. వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన చేనేత కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు నానమాల ఉప్పలయ్య, అధ్యక్షుడు సీత శంకర్, వేముల భాస్కర్, కడవేరు యాదగిరి, రవ్వ జయప్రకాశ్, బొమ్మ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. రాజాపేట మండంలంలోని రఘునాథపురం గ్రామ పంచాయతీ వద్ద పద్మశాలి సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తాసీల్దార్ జయమ్మకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కటకం జనార్ధన్, సర్పంచ్ గాడిపల్లి శ్రవన్‌కుమార్, కటకం వెంకటేశం, బింగి రమేశ్, భా స్కర్, వెంకటేశం, సుధాకర్, కృష్ణ, నర్సింగరావు పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో చేనేత కార్మికులు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతిపత్రం అందిచారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది రాములు, జిల్లా కార్యదర్శి సుల్తాన్ పురుషోత్తం, మండల అధ్యక్ష, కార్యదర్శులు నోముల స్వామి, గాడిపల్లి ఉదయ్‌కుమార్‌తో పాటు మురళి, వెంకటేశ్, భిక్షపతి, ధనలక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు. రామన్నపేట మండల, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిరసన ర్యాలీ తీసి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా నాయకుడు పున్న జగన్మోహన్, సిరిపురం సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, టెరికాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జెల్ల వెంకటేశం, పట్టణాధ్యక్షుడు రచ్చ యాదగిరి, జానయ్య, కైరంకొండ చక్రపాణి, సంగిశెట్టి సుదర్శన్ పాల్గొన్నారు. గుండాల మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం చైర్మన్ దుడుక ఉప్పలయ్య, జిల్లా నాయకుడు చిందం ప్రకాశ్‌తో కలిసి చేనేత కార్మికులు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఇన్చార్జి తాసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు.