భీమ్‌గల్/మోర్తాడ్, డిసెంబర్ 23: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ్ గ్లోబల్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెండోరా గ్రా మానికి చెందిన కుంట రాజన్న, మోర్తాడ్‌కు చెందిన లక్ష్మీనర్సయ్యకు రాష్ట్రస్థాయి ఆదర్శరైతు పురస్కారాలను అందజేశారు. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ వారికి అవార్డును అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూసారాన్ని కాపాడేందుకు అవలంబిస్తున్న పద్ధతులు, సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడు లు సాధిస్తున్నందుకు పురస్కారం అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రవీందర్ ర్యాడ, ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, భీమ్‌గల్ ఏపీఎం శ్రీనివాస్, రైతులు గాజరి లింబాద్రి, గుమ్ముల ధర్మారెడ్డి, డాగ లింబాద్రి, మారుతి, సురేశ్ తదితరులు ఉన్నారు.
రైతులకు సన్మానం
ఆర్మూర్, డిసెంబర్ 23: రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో పలువురు రైతులను గురువారం సన్మానించారు. సన్మానం పొం దిన వారిలో రైతులు బొగడమీది భాజన్న, ఒడ్డెన్న, లింబన్న ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రైతే దేశానికి వెన్నెముక అన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్‌కుమార్, ప్రోగ్రాం చైర్మన్ ద్యాగ ఉదయ్‌కుమార్, చెన్న రవికుమార్, కార్యదర్శి సంతోష్‌కుమార్, కోశాధికారి జ్ఞానీ చావ్లా తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు నాయకుడు కోటపాటిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగుచేయాలని సూచించారు. రైతులను సన్మానించిన బ్రహ్మకుమారీలను అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థుల క్షేత్ర సందర్శన..
నవీపేట, డిసెంబర్ 23: నవీపేటలోని లిటిల్ ఫ్లవర్ స్కూ ల్ విద్యార్థులు క్షేత్ర సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూలీలతో కలిసి నాటు వేశా రు. వ్యవసాయంలో యంత్రాల ఆవశ్యకతను ప్రైవేటు కంపెనీ ప్రతినిధి అరుణ్ విద్యార్థులకు వివరించారు.