తుర్కపల్లి, ఏప్రిల్ 23 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమమంలో భాగంగా శనివారం మండలంలోని దత్తాయిపల్లి జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు.
ఆనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. సబ్బండ వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. దేశంలోనే అత్యధిక గురుకులాలను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. నాగరిక సమాజ నిర్మాణానికి విద్య ఒక్కటే కొలమానం అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదుగాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సంహులు, సర్పంచ్ రామ్మోహన్‌శర్మ, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, ఎంఈఓ కృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పత్తిపాటి మంజుల, బద్దూనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.