అమీర్పేట, బేగంపేట : దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా బల్కంపేట ఎల్లమ్మ
దసరా నవరాత్రుల్లో భాగంగా అయిదవ రోజున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కటి రంగులతో అలంకరించారు.
అన్నపూర్ణాదేవిగా అమీర్పేట కనకదుర్గ
అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవారు సోమవారం నాడు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే అమీర్పేట్ హనుమాన్ దేవస్థానంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ సరస్వతిదేవిగా ఉజ్జయినీ మహంకాళి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు లష్కర్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు శ్రీ సరస్వతిదేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శినమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.