Hyderabad | మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్

చాదర్ఘాట్ :ముసరాంబాగ్ డివిజన్లోని తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్, పాతమలక్పేట, ఆజంపురా డివిజన్లలో జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. ముందుగా మూసీ ఒడ్డున ఉన్న తీగలగూడ గుడిసెల్లో పర్యటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 200 మంది గుడిసెవాసులు నివాసమంటున్నట్లు ఎమ్మెల్యే అహ్మద్ బలాల కలెక్టర్ శర్మన్ కు వివరించారు.
వీరందరికీడబుల్బెడ్ రూంలను నిర్మించాలని కోరారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా మునగణూరులో నిర్మిస్తున్న ఇళ్లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించడంతో గుడిసెవాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాతమలక్పేట డివిజన్లోని వాహెద్నగర్ ప్రభుత్వ పాఠశాలను వారు సందర్శించారు. మధ్యాహ్న భోజనం గురించి వారు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ప్లే గ్రౌండ్ ను ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ సామ్రాట్ అశోక్కు సూచించారు.
అదే విధంగా చాదర్ఘాట్లోని ప్రభుత్వ సిటీ మోడల్ స్కూల్లో సౌకర్యాల గురించి అక్కడికి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, చార్మినార్ జోనల్ కమీషనర్ సామ్రాట్ అశోక్, డీసీ రజినీకాంత్రెడ్డి, సైదాబాద్ తాసీల్దార్ ప్రసాద్రావు, ఈఈ రాధిక, డీఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

