బడంగ్‌పేట : తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జంగ్ సైరన్ మోగించిన ప్రముఖ ఉద్యమ గాయకులు జంగ్ ప్రహ్లాద్ మరణం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలాల గర్జన పేరుతో గాయకుడిగా ప్రహ్లాద్ చేసిన సాంస్కృతిక పోరాటం ఎంతో గొప్పదని పేర్కొంటూ ప్రహ్లాద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జంగ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.