బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నూతనంగా ఏర్పాటు చేసిన రాపోర్ట్ షూ స్టోర్‌ను రాష్ట్ర పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. అంతర్జా తీయ బ్రాండ్స్‌తో పాటు కస్టమర్ల అవసరాలకు తగినట్లు కస్టమయిడ్ చెప్పులు, షూస్ తయారు చేయడంతో పాటు అనేక ప్రత్యేకతలతో ప్రీమియం షూస్ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.