ఖమ్మం, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. కేంద్రం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సర్వీసులు అందజేసే పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తున్నది. డీజీపీ కె.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ విభాగాల్లో 68 మంది పోలీస్ అదికారులు, కానిస్టేబుల్స్‌కు పతకాలు లభించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ అవార్డులు పొందిన వారి వివరాలు
మహోన్నత సేవా పతకం విభాగంలో హైదరాబాద్ ఇంటిలిజెన్సీ విభాగంలో పని చేస్తున్న పి.డి. క్రిష్టొఫర్( హెడ్ కానిస్టేబుల్-1892, భద్రాద్రి కొత్తగూడెం)- ఉత్తమ సేవా పతకం విభాగంలో