బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయాన్ని సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. మహంకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈవో గుత్తా మనోహార్‌రెడ్డి కేంద్రమంత్రిని శాలువ కప్పి సత్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం దేవాలయం ఆర్చిగేట్ వద్ద జీహెచ్ఎంసీ బేగంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.