సైదాపూర్, ఏప్రిల్ 17: కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బీడు పడ్డ భూములను అభిషేకిస్తూ సస్యశ్యామలం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు జలాలు చేరుకోగా, టీఆర్ఎస్ నాయకులు, రైతులు సంబురపడ్డారు. దుద్దెనపల్లి వద్ద కాలువలోకి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో కాలువలో పేరుకుపోయిన తుంగ, ఇసుకను తొలగించి జలాల రాకకు మార్గం సుగమం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచ్ తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీశ్‌రావు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ గ్రామ కోర్డినేటర్ పరుకాల నారాయణగౌడ్ ఉన్నారు.