
రైతు బంధు పథకం అన్నదాతల మోముల్లో చిరునవ్వులు చిందిస్తున్నది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 1.61 లక్షల మంది రైతులకు రూ.199 కోట్లు జమయ్యాయి. మూడు రోజుల్లో 6,71,666 మంది రైతులకు రూ. 466,71,62,745 అందాయి. నగదు అందుకున్న రైతులు పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొంటున్నారు.
సాయంపై సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
తుర్కపల్లి, డిసెంబర్ 30 : వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. రైతుబంధు నగదు విడుదల చేయడాన్ని హర్షిస్తూ గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బద్దూ నాయక్, పత్తిపాటి మంజుల, టీఆర్ఎస్వీ, యువజన విభాగం మండలాధ్యక్షులు జాలిగాం కృష్ణ, సీస భరత్, ఎస్సీసెల్ అధ్యక్షుడు బాబు, సర్పంచులు రామ్మోహన్‌శర్మ, మహేందర్, సోషల్‌మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, నాయకులు భాస్కర్‌నాయక్, సురేందర్, కర్ణాకర్ పాల్గొన్నారు.
రైతు బంధు సాయం పంపిణీపై అన్నదాతలు ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ముందే పెట్టుబడి నగదు జమ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.61 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.199 కోట్లు జమయ్యాయి. తొలి రోజు ఎకరం లోపు భూమి ఉన్న 2.54 లక్షల మందికి రూ.79.81 కోట్లు, రెండో రోజు రెండెకరాల భూమి ఉన్న 2.56 లక్షల మందికి రూ.187.55 కోట్లు జమయ్యాయి. మొత్తం మూడు రోజుల్లో 6,71,666 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.466,71,62,745 జమయ్యాయి. ఉమ్మడి జిల్లా వారీగా పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాలో గురువారం 42,815 మంది రైతులకు రూ.53,40,47,263, నల్లగొండ జిల్లాలో 81,648 మంది రైతులకు రూ.101,03,60,984, యాదాద్రి జిల్లాలో 36,973 మంది రైతుల అకౌంట్లలో రూ.44,91,77,552 జమయ్యాయి.
సీఎం రైతు బాంధవుడు
రాజాపేట, డిసెంబర్ 30 : రైతుబంధు డబ్బులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ గురువారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండల మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్, సర్పంచ్ గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు సందిల భాస్కర్‌గౌడ్, రేగు సిద్ధులు, కొండం రాజు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది..
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, డిసెంబర్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది.. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారు.. అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. రైతుబంధు డబ్బులు విడుదల చేయడంపై గురువారం పట్టణంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫ్లెక్లీలకు క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు పెట్టి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, ఎంపీపీలు బాలాజీనాయక్, నూకల సరళాహన్మంతరెడ్డి, నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సమయానికి పైసలందినయి..
మాది మెల్కపట్నం. నాకు ఎకరం 30 గుంటల భూమి ఉంది. రైతు బంధు డబ్బులు కారుకు రూ.7500 వస్తున్నాయి. వచ్చిన డబ్బులు నాటు కూళ్లు, దుక్కి పిండికి సరిపోతున్నయి. ఇప్పుడు వరి నాటు పెడుతున్న. యాసంగి సీజన్‌కు కేసీఆర్ సారు పైసలిచ్చిండు. గతంలో దుక్కిదున్నిన కాన్నుంచి పంట పూర్తయ్యే దాంకా అప్పుచేయనిదే పని కాకపోతుండె. మొత్తం అప్పేనాయె. పండిన పంట వడ్డీలకే సరిపోయేది. రైతు బంధు వచ్చినప్పటినుంచి డబ్బులు మిగులుతున్నయి. కేసీఆర్‌తోనే ఎవుసం మంచిగైంది.
అప్పు చేసే అవసరం రాలేదు..
మాది రైతు కుటుంబం.. వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నం. తెలంగాణ రాకముందు రైతులందరం అరిగోస పడ్డం. కనీసం ఎరువులు కూడా దొరికేటివి కావు. పంట పెట్టుబడికి మస్తు తిప్పలయ్యేది. షావుకారు దగ్గర అప్పు తీసుకునేది. పంట అమ్మినంక అప్పు కట్టేవాళ్లం. పగలనక రాత్రనక కష్టపడితే తిండికి కూడా మిగిలేవి కావు. తెలంగాణ వచ్చిన తరువాత మా బతుకులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో చేస్తుండు. వ్యవసాయానికి 24గంటలు కరంటు, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇస్తుండు. పెట్టుబడికి రంది లేకుండా ఎకరానికి 5వేలు ఇచ్చుడంటే గొప్ప విషయం. నాకు ఎకరం 22 గుంటల భూమి ఉన్నది. ఏటా 15వేల రూపాయలు ఇస్తున్నరు. వాటితోనే పెట్టుబడి ఖర్చు తీరుతుంది.
చిత్రపటానికి పాలాభిషేకం
మునగాల, డిసెంబర్ 30 : రైతుబంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం మండల పరిధిలోని కృష్ణానగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని కొనియాడారు.
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్…
చౌటుప్పల్, డిసెంబర్ 30 : రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో గూడుకట్టుకున్నారని మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. 8వ విడుత రైతుబంధు డబ్బులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ స్థానిక మార్కెట్ యార్డులో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గురువారం రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, యూత్ అధ్యక్షుడు తొర్పునూరి నర్సింహగౌడ్, వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్‌చారి, నాయకులు దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, భీంరెడ్డి రాంరెడ్డి, సుర్కంటి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ఆలేరు టౌన్, డిసెంబర్ 30 : ఆలేరులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు భేతి రాములు, రాయపురం నర్సింహులు, కందుల శ్రీకాంత్, నాయకులు ఆడెపు బాలస్వామి, కుండె సంపత్, సరాబు సంతోష్, బింగి రవి, జనగాం వెంకటపాపిరెడ్డి, నర్సింహులు దేవదానం, ఫయాజ్, శివమల్లు, శ్రావణ్, నవీన్ పాల్గొన్నారు.
ఇప్పుడు అప్పు తెస్తలేను
నాకు ఐదెకరాల భూమి ఉంది. తెలంగాణ రాక మునుపు ఎప్పుడూ నీళ్లు లేకపోయేది.. వానకాలం మట్టుకు పత్తి వేసేది.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వచ్చినంక కాలం మంచిగైతున్నది. పుష్కలంగా కరంట్ ఇస్తున్నడు. పంటలేసే గడియకు రైతుబంధు పైసలిస్తున్నడు. నాకు కారుకు 25 వేల రూపాలు వస్తున్నయ్.. ఏటా 50 వేలు అందుతున్నయ్.. రైతు బంధు డబ్బులతోనే బోరు వేసిన. 25 వేలు పెట్టి పైపులు కొన్న. వానకాలంల పత్తి వేసి.. యాసంగిలో పల్లి వేసిన. గతంల ఎప్పుడూ రెండు పంట వేయలే.. ఇప్పుడు అప్పు కోసం ఎవరి తాడికి పోతలేను. రైతు బంధు డబ్బులే సరిపోతున్నయ్. పండించిన పంటలో బాగానే లాభం వస్తున్నది.