e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home జిల్లాలు సండే-ఫన్‌డే లండన్‌లా ఉండే..

సండే-ఫన్‌డే లండన్‌లా ఉండే..

అమెరికా, లండన్‌ వీధుల్ని తలపిస్తున్న ట్యాంక్‌బండ్‌
ప్రభుత్వ వసతులకు సందర్శకులు ఫిదా
మిరుమిట్లు గొలిపే లైటింగ్‌, ఆహ్లాదకర వాతావరణం
చేనేత, హస్తకళా స్టాళ్లతో చారిత్రక వారధి కళకళ
సండే-ఫన్‌డే వినోదాన్ని చిత్రీకరించిన ఇంటర్‌ విద్యార్థిని
మంత్రి కేటీఆర్‌ నిర్ణయం భేష్‌ అని నెటిజన్ల ప్రశంసలు
సాధారణ పౌరుడి విన్నపానికి గౌరవమివ్వడం గ్రేటని కితాబు

సిటీబ్యూరో, నవంబర్‌ 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం జరుగుతున్న సండే ఫన్‌డేపై యువతి, యువకులు, విద్యార్థులు, పిల్లలు, గృహిణీలు, వృద్ధులు, యూ ట్యూబర్‌లు ఇలా అన్ని వర్గాల వారు ఫిదా అయ్యారు. సండే ఫన్‌డే సందర్భంగా ఇక్కడ నెలకొంటున్న వాతావరణం… ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో లండన్‌ స్ట్రీట్స్‌ను తలపిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సండే ఫన్‌డేపై ఆసక్తిని పెంచుకున్న నగరంలోని రిసాలాబజార్‌ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థిని జెర్రి అక్షిత ఓ వీడియోను స్వయంగా రూపొందించింది. 7నిమిషాల్లో అక్షిత సండే ఫన్‌డే వద్ద చోటుచేసుకున్న వాతావరణాన్ని యాంకరింగ్‌ చేస్తూ సందర్శకుల అభిప్రాయాలను సేకరించింది. ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి పౌరుడు ప్రభుత్వం.. మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓ సాధారణ పౌరుడి విజ్ఞప్తికి స్పందించి నగరం నడిబొడ్డున ప్రజల మానసికోల్లాసానికి అనేక సౌకర్యాలను కల్పించడం అద్భుతమని చెప్పారు. అంతేకాకుండా లండన్‌, అమెరికాల్లో ఫన్‌డే స్ట్రీట్‌లను తలపించే విధంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో అక్షిత ఫ్రెండ్స్‌ గ్రూపులతో పాటు సోషల్‌ మీడియాలో చాలా మంది సబ్‌స్ర్కైబ్‌ అయి తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో చిత్రీకరణ ఇలా..
ట్యాంక్‌బండ్‌ను చూపిస్తూ ప్రారంభమయ్యే వీడియో.. ‘ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దారు. కానీ మాకు అక్కడ గడిపేందుకు అవకాశం కల్పించాలని ఓ పౌరుడు పెట్టిన ట్విటర్‌ పోస్టుకు స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశిస్తూ చేసిన పోస్టును పొందుపర్చి మంత్రి కేటీఆర్‌ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని’ అక్షిత వివరిస్తుంది. ఆ తర్వాత సందర్శకులకు వినసొంపుగా ఉండే ఆర్మీ బ్యాండ్‌, మహిళల భద్రతపై హైదరాబాద్‌ పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమం, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, షీ టీమ్స్‌ కార్యక్రమాలు, ఈ స్ట్రీట్‌పై అందుబాటులో ఉన్న చిరుతిండ్లు, టిఫిన్స్‌, ఏర్పాటైన స్టాల్స్‌, ఉచితంగా మొక్కల పంపిణీ, అక్కడ నెలకొన్న దీపాలంకారణ వంటిని చూపిస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేస్తున్న తీరును చూపించింది. అందులోనే స్ట్రీట్‌లో నెలకొన్న వాతావరణంపై అభిప్రాయాలను తీసుకుంది. ఇలా మొత్తం అక్షిత తన అత్తతో కలిసి 7 నిమిషాల నిడివి గల ఈ వీడియోను రూపొందించి జర్రి అక్షిత పేరుతో యూ ట్యూబ్‌లో పెట్టింది. వీడియో పెట్టిన నాలుగు రోజులలోనే ట్యాంక్‌ బండ్‌పై ఈ సండే-ఫన్‌డే వీడియోను దాదాపు 1000 మందికి పైగా వీక్షించారు.

- Advertisement -

చాలా హ్యాపీగా ఉంది
కరోనా కారణంగా ఇంట్లోనే ఉండిపోయి చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇప్పుడు ఇప్పుడే బయటికి వస్తున్న వారికి ఈ సండే ఫన్‌డే అందిస్తున్న ఆనందం వారిలో కొత్త జోష్‌ను నింపుతోంది. చిన్న బడ్జెట్‌లో మస్తు మస్తుగా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక్కడ ఆహ్లాదంతో పాటు తెలంగాణ సంప్రదాయ, సంస్కృతితో పాటు షీ టీమ్స్‌, ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించి కల్పిస్తున్న అవగాహన చాలా ఉపయోగకరంగా ఉంది. చిరు తిండ్లు, బొమ్మలు, పుస్తకాలు, సామాన్యుడి ధరలో అందుబాటులో ఉండడం బాగుంది. ట్యాంక్‌ బండ్‌ సండే ఫండేను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. థ్యాంక్స్‌ టూ కేటీఆర్‌.. థ్యాంక్స్‌ టూ తెలంగాణ గవర్నమెంట్‌.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement