వచ్చే యేడాదిలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లోనూ మంచి ర్యాంక్ సాధించి కరీంనగర్‌ను రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, అర్బన్ లోకల్ బాడీ అదనపు కలెక్టర్లతో పరిశుభ్ర పట్టణాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, చర్యలపై దిశానిర్దేశం చేశారు. సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో కరీంనగర్‌కు దేశంలోనే రెండో స్థానం దకడం అభినందనీయమని ప్రశంసించారు.
కార్పొరేషన్, డిసెంబర్ 30: కార్పొరేషన్, డిసెంబర్ 30: వచ్చే ఏడాది జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లోనూ మంచి ర్యాంకు సాధించి కరీంనగర్ రాష్ర్టానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో కరీంనగర్‌కు దేశంలోనే రెండో స్థానం దకడం అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరింత మంచి ర్యాంకు సాధించాలని సూచించారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, అర్బన్ లోకల్ బాడీ అదనపు కలెక్టర్లతో పరిశుభ్రత పట్టణాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర మేయర్ వై.సునీల్‌రావు, కమిషనర్ సేవాఎస్లావత్, జడ్పీ సీఈవో ప్రియాంక, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీలపై మున్సిపాలిటీలు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్‌లో కరీంనగర్ నగరపాలక సంస్థ రూ.4 కోట్ల నగదు బహుమతి సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలువడం గర్వకారణమని ప్రశంసించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో కూడా మంచి ర్యాంకు సాధించి అవార్డులు పొందేలా కృషి చేయాలన్నారు. పట్టణ పారిశుధ్యం, పచ్చదనం, పట్టణ ప్రగతిపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణ, సెగ్రిగేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మురుగునీటి శుద్ధీకరణపై మేయర్ సునీల్‌రావు కృషి అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలోనే ప్రతి రోజూ తాగునీటి సరఫరా చేస్తున్న మొట్టమొదటి నగరపాలక సంస్థగా కరీంనగర్ నిలిచిందని ప్రశంసించారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం నగర ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సంవత్సర కాలంగా మంచినీటి సరఫరా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా సాగుతుందన్నారు. ప్రతి రోజూ గంట పాటు ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామన్నారు. నగర ప్రజలకు 24 గంటల పాటు మంచినీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే వీటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పైలెట్ ప్రాజెక్టు కింద మూడు రిజర్వాయర్లను ఎంపిక చేశామన్నారు. పట్టణ ప్రగతి నిధులు రూ.50 కోట్లలో రూ.32 కోట్లు ఖర్చు చేసి నగరంలో వాకింగ్ ట్రాక్‌లు, పారులు, గ్రేవియార్డులు, ఇంటిగ్రేటెడ్ మారెట్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి నిధులతో నగరంలో నిర్మించిన అధునాతన మరుగుదొడ్ల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగే పట్టణ ప్రగతి దినోత్సవం నాటికి నగరాభివృద్ధికి సంబంధించిన ప్రగతి నివేదిక కూడా విడుదల చేసి వివరాలను అందిస్తామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితో నగర పరిశుభ్రతను మెరుగు పరిచామన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. డివిజన్ వారీగా నియమించిన వార్డు కమిటీలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. వీసీలో నగరపాలక, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బల్దియాను ప్రశంసించిన మంత్రి
కరీంనగర్ నగరపాలక సంస్థ చేపడుతున్న పలు పనితీరుపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నగరంలో ప్రతి రోజు మంచినీటి సరఫరా విషయంపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ఈ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలపడంతో మేయర్, పాలకవర్గాన్ని అభినందించారు. అలాగే రానున్న రోజుల్లో నగరంలో పైలెట్ ప్రాజెక్టు కింద మూడు రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు కూడా నిర్వహించామని మేయర్ సునీల్‌రావు తెలిపారు. వచ్చే ఆరు, ఏడు నెలల్లో ఈ పనులు పూర్తి చేసి నీటి సరఫరా అందిస్తామని పేర్కొనడంతో. . . దేశంలోనే 24 గంటల నీటి సరఫరా అందించిన నగరంగా కరీంనగర్ నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పనులు చేపడుతున్న స్థానిక నేతలను, అధికారులు అభినందించారు. అలాగే సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్ పోటీలోనూ దేశంలోనే రెండో స్థానంలో నిలువడంపై మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు, పాలకవర్గం, మేయర్, అధికారులను అభినందించారు. వచ్చే రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ మంచి ర్యాంకు సాధించాలని సూచించారు. అలాగే మురుగునీటి శుద్ధీకరణ కార్యక్రమంలోనూ బల్దియా పోటీలో ఉందని మేయర్ చెప్పగా, మరింతగా కృషి చేసి మంచి ర్యాంకు సాధించాలని కేటీఆర్ సూచించారు.