
రామగిరి, డిసెంబర్ 10 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ) ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. ఎంఎంఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, చౌటుప్పల్ జట్టు ద్వితీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు ఈ నెల 21 నుంచి 26వరకు బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా.జి.ఉపేందర్‌రెడ్డి, పీడీ డా.ఆర్.మురళి, ఉమెన్స్, ఎన్జీ కళాశాలల పీడీలు కళ్యాణి, కడారి మల్లేశ్, ఎంజీయూ అసిస్టెంట్ ప్రొ.మారం వెంకటరమణారెడ్డి, వివిధ కళాశాలల పీడీలు పాల్గొన్నారు.
ఉమెన్స్ పుట్‌బాల్ జట్టు ఇదే..
క్రీడాకారిణి కళాశాల/ప్రాంతం
పి.భాగ్యమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ
ఎస్.పూజిత టిఎస్డబ్ల్యూఆర్ ఏఎఫ్పీడీసీ, భువనగిరి
వి.సోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ
వి. శ్రీలత ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ
ఏ.చిట్టి టిటిడబ్ల్యూ ఆర్డీసీడబ్ల్యూ, దేవరకొండ
కే.స్వాతి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ
జే.ప్రసన్న ఎస్కేసీపీఈ, శ్రీరాంపురం, హాలియా
ఎన్.కళ్యాణి టీటీడబ్య్లూ ఆర్డీసీ డబ్ల్యూ, దేవరకొండ
పి.శృతి టీఎస్డబ్ల్యూఆర్డీసీ, సూర్యాపేట
పి.యశోద డా.ఎంఎంఆర్ ఫిజికల్
ఎడ్యుకేషన్ కళాశాల, చౌటుప్పల్
జి.భార్గవి టీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్స్, సూర్యాపేట
జి.అఖిల టీఎస్‌డబ్ల్యూఆర్ ఏఎఫ్పీడీసీ, భువనగిరి
ఎం.అంజలి టీటీడబ్ల్యూఆర్డీసీ, దేవరకొండ
వి.సౌమ్య ఎస్కేసీపీ, శ్రీరాంపురం, హాలియా
వి.ప్రియాంక ఎంఎంఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్
బి.ప్రమీల ఎంఎంఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్
బి.పావని డీఎస్డబ్ల్యూఆర్డీసీ, సూర్యాపేట
ఏ.పూజ టీటీడబ్ల్యూఆర్డీసీ, సూర్యాపేట