Oval for blind children
చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చేయాలని ఆ తల్లి ఎమ్మెల్యే ముఠా గోపాల్ను ఆదివారం వేడుకున్నది.
అచ్చయ్యనగర్లో నివాసముంటున్న అంజి, శ్యామలకు ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు గాయత్రి(5), చిన్న కూతురు అంజలి(3)పుట్టుకతోనే అంధులు. పాలమూరు బస్తీలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసి తన ఇద్దరి కూతుళ్ల సమస్యను తెలిపింది. స్పందించిన ఎమ్మెల్యే వైద్యం కోసం ప్రభుత్వం తరఫున సాయం అందిస్తానన్నారు.