
ఉప్పల్, నవంబర్ 27 : థీమ్ పార్కుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో రూ.2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్న స్మార్టు పార్కును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే పార్కును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. థీమ్ పార్కుల పేరుతో చాలా ప్రాంతాల్లో పార్కులను ఏర్పాటు చేశారని.. ఇందులో భాగంగా ఉప్పల్‌లో నిర్మించారన్నా రు. గ్రామీణ వాతావరణంతోపాటుగా, వివిధ ఆకృతులతో పార్కును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ వసంత, నవీన్‌రెడ్డి, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు గొరిగె ఐలేశ్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఉప్పల్ డివిజన్, శ్రీరమణపురం కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు శనివారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో డ్రైనేజీ, వాటర్పైపులైన్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, నాగేశ్వర్ రావు, ప్రదీప్‌కుమార్, రాములు, నరసింహారెడ్డి, సీతారామశర్మ, నేతలు గరిక సుధాకర్, పిట్టల నరేశ్, దాచేపల్లి శ్రీధర్, కొంగల శ్రీధర్, అబ్బుబాయ్ పాల్గొన్నారు.