కొండాపూర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్కేవ్లో నిర్వహించిన సదర్ సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల ఐక్యతకు స్పూర్తిగా సదర్ సమ్మేళాన్ని నిర్వహిస్తున్నారని, అందంగా ఆకట్టుకునేరీతిలో ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ప్రతి యేటా నిర్వహి స్తున్న సదర్ ఉత్సవాలు ఈ ఏడాది సైతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సహాంతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, మాదాపూర్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు రవీందర్రెడ్డి, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.