రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి, అప్పు తెచ్చి, లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. ఇయాళ సీఎం కేసీఆర్ వచ్చాక లాగోడికి ఇబ్బంది లేదు.. గిట్ల ఎవలియ్యలె.. ఏ సర్కారు జెయ్యలె’.. రైతులోకం ఆనందం వ్యక్తం చేస్తున్నది. ‘సీఎం కేసీఆర్ సార్ సల్లంగా ఉండాలి’.. అంటూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశా రు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. గజ్వేల్‌లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌లో మాణిక్‌రావు, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతులు పాల్లొన్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం కేసీఆర్ వచ్చాక లాగోడికి ఇబ్బంది లేదు. ‘గిట్ల ఎవ్వలివ్వలె.. ఏ సర్కారు ఇయ్యలే.. ఇయ్యాల కేసీఆర్ సార్ సమయానికి పైసలిత్తుండు. వీటిని సక్కగా వాడుకుంటున్నాం. ఇత్తులు, ఎరువులు కొనుక్కుంటం.. ఇప్పడు ఇచ్చేదానితో ఎనిమిది కార్లకు సా యం అందింది. సీఎం కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలి..’ అని గ్రామాల్లో బుధవారం సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు రైతులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. గజ్వేల్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌లో మాణిక్‌రావు, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీచైర్మన్లు, రైతుబంధు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతులు పాల్లొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాసంగిలో సాగు పెట్టుబడుల నిమి త్తం ఎకరాకు రూ. 5వేల చొప్పున రెండు రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు జమ కాగా, రెండోరోజు రెండెకరాలలోపు వారికి డబ్బులు జమ చేశామని తెలిపారు. వారం పది రోజుల్లో అర్హులైన రైతులందరికీ డబ్బులు అందుతాయన్నారు. రైతు బంధు సాయా న్ని కొంతమంది వ్యవసాయ బావులకు, మరికొంత మంది సాగు కోసం, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ఇలా వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సకల వసతులను కల్పిస్తుండడంతో రైతులు సాగును సంబురంగా చేసుకుంటున్నారని, పుష్కలంగా నీరు అందివ్వడంతో ప్రతి గుంట సాగులోకి వచ్చిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ఇది గిట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు అడగకముందే రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.
రెండు రోజుల్లో 5,20,425 మంది రైతులకు రూ.245.76 కోట్లు
ప్రభుత్వం రెండోరోజూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2,40,387 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.168,44,31,775 జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 84,030 మంది రైతులకు గాను రూ.59,69,71,806, మెదక్ జిల్లాలో67,929 మందికి రూ.46,14,36,443, సంగారెడ్డి జిల్లాలో 88,428 మందికి రూ.62,60,23,526 ప్రభు త్వం రైతుబంధు డబ్బులను వేసింది. ఈ రెండు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,20,425 మందికి రూ.రూ.245,76,69,042 వేశారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్, డిసెంబర్ 29 : అన్నదాతలు అప్పులు తీసుకోకుండా పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరాకు రూ.10 వేలు పంట పెట్టుబడి కోసం ఇస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో విడుత రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నదన్నారు. యాసంగి వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో సీఎం కేసీఆర్ పెట్టుబడి కోసం డబ్బులు వేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉండాలన్నారు. జహీరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు మొయినోద్దీన్, ఎంజీ.రాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

రైతుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
గజ్వేల్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంగజ్వేల్, డిసెంబర్ 29 : రైతులు ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు అన్నారు. రైతుబంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నందున బుధవారం గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుబంధు ఎనిమిదో విడుత కింద గజ్వేల్ నియోజకవర్గంలోని 90903 మంది రైతుల అకౌంట్లలో రూ. 68కోట్ల78లక్షలు జమచేసినట్లు తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడినప్పుడే గ్రామాల్లో ఆర్థిక అసమానతలు పోయి అభివృద్ధి చెందుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక రైతులు పండించిన వడ్లను కొనే విషయంలో కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఏ పంట వేసినా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లు, ఆత్మకమిటీ చైర్మన్ మల్లయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు
మెదక్, డిసెంబర్ 29 : రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, రైతులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో పంట పెట్టుబడికి ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రతీ సంవత్సరం యాసంగి, వానకాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఎనిమిదో విడుత రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రం మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రైతుబంధు పథకంపై ప్రపంచ దేశాల్లో కూడా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 2.48 లక్షల మందికి రూ.198కోట్లు రైతు బంధు పథకం కింద ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పారు.
గల్లీలో ఒక మాట.. ఢిల్లీలో మరోమాట..
కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదని, బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట.. ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని వారి మాటలను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఇతర పంటలను వేసుకోవాలని, రైతు బంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను ఇతర పంటల పెట్టుబడికి ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, మండల అధ్యక్షుడు అంజాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణ ఎస్సీ యూత్ అధ్యక్షుడు శాంసన్బానీ, పాపన్నపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
94.798 మంది ఖాతాల్లో రూ.24.49 కోట్లు జమ
ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకం ఎనిమిదో విడుత సహాయం మంగళవారం నుంచి ప్రారంభమైంది. మెదక్ జిల్లాలో 2,46,626 మంది రైతులుండగా, మొదటి రోజు 94,798 మంది ఖాతాల్లో రూ.24 కోట్ల 49 లక్షలు జమ అయ్యాయి. రైతు బాంధవుడుగా, రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమమిస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా వచ్చే డబ్బులను ఇతర పంటల పెట్టుబడి కోసం రైతులు వినియోగించాలి.
-తాడెపు సోములు, రైతు బంధు సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు
పెట్టుబడికి రంది లేదు
గతంలో పంటలు సాగు చేయాలంటే అవసరమైన డబ్బులను ప్రైవేటు వడ్డీ లేదా తెలిసినోళ్ల దగ్గర మిత్తికి తెచ్చేవాళ్లం. తిరిగి పంటలు వచ్చిన తర్వాత మిత్తితో సహా చెల్లించేవాళ్లం. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా సాగుకు అయ్యే ఖర్చులను మా అకౌంట్లలోనే వేస్తుండడంతో సాగుకు రంది లేకుండా పోయింది. అకౌంట్ల పడిన వెంటనే మందుల సంచులు తెచ్చుకుంటున్నాం.
శ్రీను, రైతు , హవేళీఘనపూర్, మెదక్ జిల్లా
హాయిగా సాగు చేసుకుంటున్నరు..
గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవాళ్లం. సాగు కోసం డబ్బులు లేక కొందరు రైతులు షావుకార్ల వద్ద మిత్తికి తెచ్చి తీరా దిగుబడి రాక, అటు అప్పులు తీర్చిలేక ఆత్మహత్యలు చేసుకునేవారు. అన్నదాతల బాధలు అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు బీమా పథకం ద్వారా ఎంతో చేయూతనిస్తున్నారు. దీంతో, రైతులు హాయిగా పంటలను సాగు చేసుకుంటున్నారు.
సాప సాయిలు, రైతు, గాజిరెడ్డిపల్లి, మెదక్ జిల్లా
సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం
ప్రతి ఏడాది, పంటలకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందిస్తున్నడు. గింత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం దేశంలోనే ఆదర్శంగా నిలిచిండు. స్వయంగా రైతు కాబట్టే ముందు చూపుతో ఇంత మంచి పని చేసిండు. నాకు ఎకరానికి రూ.5వేలు ఖాతాలో పడ్డయ్. ఈ డబ్బులను బోర్ మోటర్ మరమ్మతు, ఎరువులు, విత్తనాల కోసం వినియోగిస్తా. రైతుల కోసం ఇలాంటి పథకాలు తేవడం అదృష్టంగా భావిస్తున్నా.
-ఆంజనేయులు, రైతు, రాయిన్‌పల్లి, మెదక్ మండలం
నాలుగేండ్ల నుంచి అప్పులు లేవు
నాలుగేండ్ల నుంచి కేసీఆర్ దయ వల్ల రైతు బంధు పథకంతో అప్పు లేకుండా ఉన్న. ఆరేండ్ల క్రితం అప్పులు ఎక్కువై నా భర్త హైదరాబాద్‌లో పనికి పోయిండు. ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చి ఒక ఎకరం భూమిని కౌలుకు తీసుకొని కూరగాయల పంటలను పండిస్తున్నాం.మాకు మంచి లాభాలు వస్తున్నయ్. పెట్టుబడి సాయం నేరుగా బ్యాంక్‌లో పడుతుంది.
-లత, రైతు, రామాయంపేట, మెదక్ జిల్లా
ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు చెక్
రైతు బంధు సాయం ఎంతో మేలు చేస్తుంది. సమయానికి పంట పెట్టుబడికి డబ్బులు అందుతుండడంతో వట్పల్లి మండల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుం డా నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేయడం హర్షణీయం. రైతులకు అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగింది. ప్రైవే టు వడ్డీ వ్యాపారులకు చెక్ పడింది. రైతుల బాధలను గుర్తించి, సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్.
-అశోక్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, వట్పల్లి మండలం
ప్రతీ సీజన్లో పెట్టుబడి సాయంతోనే సాగు చేస్తున్నా
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా చరిత్రలో నిలుస్తాడు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే 24 గంటలు కరెంట్‌ను ఉచితంగా ఇచ్చాడు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ఇచ్చి అప్పుల నుంచి కాపాడిండు. ఏటా నాకు పెట్టుబడి సాయమందుతుంది. నాకున్న రెండున్నర ఎకరాలకు రూ. పన్నెండు వేల ఐదువందలు బ్యాంకు ఖాతాలో జమైంది. దేశ చరిత్రలో రైతులను ఆదుకుంటున్న ఒకే ఒక్క సీఎం మన కేసీఆర్ సారు. ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ, దయకు రుణపడి ఉంటాం. ఇతర పంటల కింద ప్రస్తుతం టమాటా సాగు చేశా. ఇప్పుడు టమాటాకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.
-అమ్మగారి రవీందర్‌రెడ్డి, రైతు, గుమ్మడిదల
మంచి పని చేస్తున్న సీఎం
రైతులందరూ బాగుండాలని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికి డబ్బులు ఇస్తుండు. దేశంలో ఇంతమంచి సీఎం మరెక్కడా లేడు. నా చేనులో శనగ పంట వేసిన. పురుగు మందులు కొట్టడానికి పైసలు సరిపోతయి. పంటల సమయంలో రైతుబం ధు ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నది.
-సత్యమ్మ, రైతు, కవేలి, కోహీర్ మండలం
రైతులంటే సీఎంకు ఎంతో అభిమానం
రైతులంటే సీఎం కేసీఆర్ సార్‌కు ఎంతో అభిమానం. రైతులందరూ అభివృద్ధి చెం దాలని అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నడు. ఇంతకుముందు వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ వచ్చినంక రైతుబంధు ఇస్తున్నందున పెట్టుబడికి ఇబ్బందులు తప్పినయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-నారాయణరెడ్డి, రైతు, దిగ్వాల్, కోహీర్ మండలం
రైతుల బతుకులు మారుతున్నయ్..
రైతులకు పెట్టుబడి భారం కాకూడదని సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మేలు చేసిండు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ప్రతి ఏటా రూ. 40 వేలు వస్తున్నయి. నా పొలంలో కంది, సోయ, జొన్న పంటలతో పాటు చెరుకు పండిస్తున్నాను. ఎరువులు, విత్తనాల కొనుగోలు, సాగు ఖర్చులు, కూలీలకు డబ్బులు చెల్లించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నయ్. తెలంగాణ సర్కారు పాలనలో రైతుల బతుకులు మారుతున్నయ్.
-పూర్ణచందర్, రైతు, ఖలీల్పూర్, న్యాల్కల్ మండలం
ఎంతగానో ఉపయోగపడుతుంది
రైతుబంధు ద్వారా పెట్టుబడి అందిస్తుండడం సంతోషంగా ఉంది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సర్కారు ఇచ్చే సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను పండించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నయ్. నాకు ఉన్న ముడున్నర ఎకరాలకు ప్రతి వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి రూ. 26వేలు వస్తున్నాయి. పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
నర్సింహారెడ్డి, రైతు, మామిడ్గి, న్యాల్కల్ మండలం
లాగోడికి తిప్పల్లేకుండ జేసిండు
కేసీఆర్ సార్ రాక ముందు లాగోడి (పెట్టుబడి) పైసలకు అరగోస పడేటోళ్లం. బంగారం కుదువపెట్టేది. అయినా ఒక్కోసారి ఒక్క రూపాయి కూడా దొరికేదికాదు. శానా కట్టమయ్యేది. గిప్పుడు గసోంటి తిప్పల్లేవు. ఎవుసం జేసేటోళ్లకు కేసీఆర్ సారు అన్ని సౌలత్ జేత్తుం డు. రైతులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల పైసలు ఏత్తండు. షావుకార్ల దగ్గర అప్పుకు పోకుండా జేసిండు. నాకు నాలుగెకరాల భూమి ఉంది. నా ఖాతాలో పైసలు పడ్డప్పుడు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తది. ఆ పైసలు తీసుకోని పంట పెట్టుబడికి ఖర్చుపెడ్తా.
-లక్ష్మణ్ నాయక్, రైతు, నాగల్గిద్ద