పెట్టుబడి సాయం ఆలోచన ప్రపంచంలోనే మొట్టమొదటిది వ్యవసాయ రంగ సంస్కరణల్లో రైతు బంధును గేమ్ ఛేంజర్ అని వ్యవసాయ నిపుణులు, ఆర్థిక వేత్తలు అభివర్ణిస్తున్నారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. మన పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, రైతులు ఆ దిశగా మొగ్గు చూపి లాభాలు పొందాలని ఆకాంక్షించారు. గ్రామగ్రామాన రైతుబంధు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయని, పార్టీలతో సంబంధం లేకుండా రైతులంతా పాల్గొంటుండడం గొప్ప విషయమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా సంబురాలు కొనసాగాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
పంటల సాగుకు ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి రైతన్నకు అండగా నిలబడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ప్రపంచంలోనే మొట్టమొదటిదని, రైతు బంధు పథకం యావత్ దేశానికి ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలేరు, భువనగిరి
మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి మంత్రి సంతోషం పంచుకున్నారు. రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.10వేలు పెట్టుబడి పెడుతున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వ మాత్రమేనని గుర్తు చేశారు.
యాదాద్రి/భువనగిరి అర్బన్, జనవరి 7: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం, ఆలేరులో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 10వరకు జరుగనున్న రైతుబంధు వారోత్సవ సంబరాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు. రైతులోకం కోరకున్నా ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందుతున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆయన అద్భుత ఆలోచన నుంచి ఉద్భవించినవేనని, అలాంటి సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలతో పాటు బీజేపీ ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని తెలిపారు. తెలంగాణ కంటే ఐదు రెట్లు పెద్దదైన ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు ఆయిల్ ఇంజన్ మోటార్ల మీదనే ఆధారపడ్డారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల నిరంతర ఉచిత కరంట్ ఇస్తున్నామని అన్నారు. సంక్రాంతి సందర్భంగా రైతులు ధాన్యపు రాశులతో ముగ్గులు వేస్తున్నారని, రైతులు వేసిన పంటలో, రైతు జీవన విధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా కనిపిస్తున్నారని, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని అన్నారు. రాష్ట్రంలోని మిగులు ప్రాంతాల్లో ఏడాదిన్నరలోగా పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తారని తెలిపారు. పత్తి క్వింటాల్ రూ.10,200 పలుకుతుందని, నీరు, కరంటు ఉచితంగా ఇస్తున్నందున రైతులు పత్తి సాగు చేయాలని, పెసర్లు, కందులు, ఆముదాలు, శనగలు, కూరగాయలు ఇతర ఆరుతడి పంటలు వేసుకుంటే లాభం ఉంటుందని చెప్పారు.
బ్రహ్మాండంగా ‘రైతుబంధు’ వారోత్సవాలు
గ్రామ, గ్రామాన, వాడ, వాడల్లో ‘రైతుబంధు’ వారోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. మూస పద్ధతిని వీడి ఆరుతడి పంటలు సాగు చేసి ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. రైతులు సగౌరవంగా బతికే రోజులు వచ్చాయని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇస్తున్నదని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా రైతుబంధును మాత్రం ఆపలేదన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్