బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని సుధామ అపార్ట్ మెంట్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్ మెంట్లోని తాళం వేసిన ఓ ఫ్లాట్ వంటింట్లో ఎలక్టిక్ కుక్కర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో వంటింట్లోని సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఎలక్టిక్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో మంటలు చెలరేగి ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.