మెహిదీపట్నం : ప్రజలకు ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టోలిచౌకికి చెందిన ఎండీ ఖాదీర్ అనే వ్యక్తికి మంజూరైన 24 వేల రూపాయల చెక్‌ను ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో లక్షల మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కార్వాన్ నియోజకవర్గంలో ప్రభుత్వపథకాలతో వేలాది మందికి తాను ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చానని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.