మెహిదీపట్నం :వినాయక చవితి సందర్భంగా ర్యాప్ ర్యాప్ షకీల్ ట్రెండీ జైబోలో గణేష్ సాంగ్ వీడీయో సాంగ్ రూపుదిద్దుకుంటోంది. గురువారం బంజారాహిల్స్‌లోని రాకాసి స్టూడియోలో ఈ సాంగ్‌లోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు.ఇందులో జూనియర్ ఆర్టిస్టులతో పాటు విదేశీబృందానికి అవకాశం కల్పించారు. ఈ వీడియో సాంగ్‌లో మ్యూజిక్డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా షకీల్ దర్శనమివ్వనున్నారు.
ఈ వీడియో సాంగ్‌ను వినాయక చవితి రోజు ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నామని షకీల్ తెలిపారు. రారా, ఆపరేషన్ 2019,మిషన్ 2020 వంటి చిత్రాలకు షకీల్ సంగీతం అందించారు.శుక్రవారం మాదాపూర్‌లోని తన స్టూడియోలో ఈ వీడియో సాంగ్ ఆవిష్కరణ ఉంటుందని షకీల్ ఓ ప్రకటనలో తెలిపారు.