
మధిరరూరల్, డిసెంబర్ 24 : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. సిరిపురం గ్రామం లో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసినా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మాటూరులో సిమెంట్రోడ్డుకు జడ్పీ చైర్మన్ శంకుస్థాపన చేశారు.చిలుకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, సర్పంచ్లు కనకపుడి పెద్దబుచ్చయ్య, మేడిశెట్టి లీలావతి, నిడమనూరి సంధ్యారాణి, ఎంపీపీ మెండెం లలిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, టీఆర్ఎస్ నాయకులు కోన నరేందర్రెడ్డి, ఏవో
డీ.ఎన్.కే.శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
బోనకల్లు, డిసెంబర్ 24 : రైతులందరూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని సహకార సంఘం అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు అన్నారు. మోటమర్రిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం విక్రయంలో నాణ్యతా ప్రమాణాలు అనుసరించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతినేని ఇందు, వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి, కావూరి శంకర్రావు, సంఘం సీఈవో గుడిదే కృష్ణారావు, సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.