అల్లాదుర్గం, జనవరి 5 : రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా బుధవారం చిల్వెర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలోనే రైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రైతుబంధు ద్వారా ప్రభుత్వం రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అంజియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దశరథ్, సర్పంచులు మల్లేశం, బేతయ్య, రంజిత్, బల్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, జనవరి 5 : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముం దుకు సాగుతూ చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుబంధు వారోత్సవాలు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో కనుల పండుగగా సాగాయి. వెల్దురి మండలంలోని బండపోసాన్‌పల్లి, హస్తాల్పూర్, మంగళపర్తి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు వ్యాసచరన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చర్లపల్లిలో మహిళలకు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రైతులు, మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు అశోక్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మమత, రామకృష్ణారావు, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల ఏవోలు మాలతి, రాజశేఖర్, ఏఈవోలు ఉత్తమ్, రేవతి, వందన, శ్రియ, మహిళలు పాల్గొన్నారు.
చిలిపిచెడ్‌లో..
చిలిపిచెడ్, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాల సందర్భంగా మండలంలోని గౌతాపూర్ గ్రామంలో రైతు సంబురాలు నిర్వహించారు. బుధవారం గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటంతో రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, కౌడిపల్లి డివిజన్ ఏడీఏ బాబూనాయక్, రైతులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు..
నర్సాపూర్, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాల సందర్భంగా బుధవారం కాగజ్మద్దూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శోభ, ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాల సందర్భంగా కొల్చారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాల్‌రెడ్డి, ఏఈవోలు వినీతాభవానీ, అంబికా, ప్రతిభ, కావేరి, భార్గవ్, పాఠశాల ప్రత్యేకాధికారి వినోద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.