
అశ్వారావుపేట, జనవరి 5 : వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంతో రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారని, గడిచిన నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన ‘రైతుబంధు’ సంబురాల్లో ఆయన పాలొని మాట్లాడారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారాన్నరు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ జూపల్లి రమేశ్, జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మండల వ్యవసాయాధికారి వై.నవీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, నాయకులు యూఎస్ ప్రకాశ్‌రావు, ముభారక్ బాబా, మందపాటి రాజమోహన్‌రెడ్డి, సత్యవరపు సంపూర్ణ పాల్గొన్నారు.
దేశ చరిత్రలో రైతుబంధు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్
అశ్వారావుపేట రూరల్, జనవరి 5 : దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేసి చరిత్రల్లో, రైతుల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం మండలంలోని వినాయకపురంలో టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, నారాయణపురం రైతువేధిక వద్ద జరిగిన కార్యక్రమాల్లో వేర్వేరుగా సీఎం కేసీఆర్ ప్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. తిరుమలకుంట రైతువేదికలో ఎంపీటీసీ నారం నాగలక్ష్మి ముగ్గులను సుందరంగా అలంకరించారు. కార్యక్రమాల్లో మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మండల అధ్యక్ష,కార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జూరి వెంకన్నబాబు, మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు కంగాల పరమేశ్, ఎంపీటీసీ మారుతి లలిత, నారం నాగలక్ష్మి, ఏఈవోలు షాకీరాభాను, రాజేశ్వరరావు, నారా యణపురం రైతు కన్వీనర్ చిన్నంశెట్టి నర్సింహరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.
రైతువేదికల్లో..
ములకలపల్లి, జనవరి 5 : రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబురాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వేధికలను రైతుబంధు అక్షరమాలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. సంబురాల్లో ఏడీఏ అఫ్జల్‌బేగం పాల్గొని మాట్లాడారు. 2018 నుంచి 2021 వరకు మండలంలో 7253 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ.182.67కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. కార్యక్రమంలో ఏవో కరుణామయి, ఎంపీపీ మట్ల నాగమణి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నాగళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, స్థానిక సర్పంచ్‌లు వాడె నాగరాజు, గడ్డం భవానీ, బీబినేని భద్రం, ఏఈవోలు పాల్గొన్నారు.
టేకులపల్లిలో..
టేకులపల్లి, జనవరి 5 : మండలంలోని రైతువేదికల్లో రైతులు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యుల ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాధ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ లక్కినేని శ్యామ్‌బాబు, ఏవో అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 10,456 మంది రైతులకు 8 విడుతల్లో రూ.82.53కోట్లు జమ అయినట్లు తెలిపారు. పెట్టుబడికి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కోరం ఉమ, మాలోత్ సురేందర్, కణితి రమాదేవి, ఇర్పా లక్ష్మీనారాయణ, బానోత్ ప్రియాంక, భూక్య గంగమ్మ, జబ్బ విజయ లక్ష్మీ, ఎంపీటీసీలు బానోత్ సరోజిని, తహసీల్దార్ కేవీ.శ్రీనివాసరావు, ఏవో విశాల, మానస, రెజీనా, టీఆర్ఎస్ నాయకలు, రైతులు పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్
రైతుబంధు సమితి రాష్ట్ర సలహాదారుడు పులిగళ్ల మాధవరావు
ఇల్లెందు, జనవరి 5 : అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని రైతుబంధు సమితి రాష్ట్ర సలహాదారుడు పులిగళ్ల మాధవరావు అన్నారు. బుధవారం మండలంలోని కొమరారంలో రైతు వేదికకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పాలిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ఏవో సతీశ్, కోఆర్డినేటర్ మంచా రమేశ్, యశ్వంత్, రాజు, సర్పంచ్ కృష్ణవేణి, నాయకులు శ్రీను, సమ్మయ్య, కోటయ్య, రాంజీ పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లిలో..
అన్నపురెడ్డిపల్లి, జనవరి 5 : మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం, అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలను మామిడి తోరణలతో సుందరంగా అలంకరించి, రంగు రంగు ముగ్గులతో అలంకరించి రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్‌రావు, మండల రైతుబంధు కో- ఆర్డినేటర్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పండుగలా సంబురాలు చేసుకున్నారు.