అనాథలకు మనమంతా అండగా ఉండాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్ : అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందు కు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అనాథ విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేతులమీదుగా వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనాథ విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రోత్స హించడం ద్వార వారు మానసికంగా ఎంతో బలపడుతారని తెలిపారు. మాధవరం నర్సింహారావు అనాథ విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని ఇతరులు స్పూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వార అనాథ విద్యార్థులకు తాము ఒంటరి కాదనే భావన ఏర్పడుతుందని తెలిపారు.
తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగాలకు దూరమైన చిన్నారులకు అండగా ఉండేందుకు ప్రతిఒక్కరూ కొంత సమయా న్ని కేటాయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ బుచ్చిరెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, బత్తు ల నాగార్జునగౌడ్, గొరిగె ప్రదీప్, నర ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాంత్, వినోద్, గౌతమ్, వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

