
ఖమ్మం, డిసెంబర్ 20: ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకమూ పేదల కోసమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించే పథకం దేశంలో మరెక్కడా లేదని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని 16, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 డివిజన్లలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు చీర, సారెను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లల వివాహం చేసేందుకు పేద కటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ పథకాల వల్ల కొన్ని లక్షలమంది పేద కుటుంబాల తల్లిదండ్రులు తమ కుమార్తెలను ధైర్యంగా వివాహాలు చేయగలుగుతున్నారని అన్నారు. అలాగే, తాను శాసనసభ్యుణ్ని కాకముందు ఖమ్మం నగరం ఏ విధంగా ఉండేదో.. ప్రస్తుతం ఖమ్మం నగరం ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక సహకారం వల్లనే ఖమ్మం రూపురేఖలు మార్చగలిగానని అన్నారు. సహకరించిన వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. మేయర్ నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణచైతన్య, మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, తౌసిఫ్, తాజుద్దీన్, ఖమర్, శోభారాణి, షకీనా, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, మందడపు లక్ష్మీమనోహర్రావు, చామకూరి వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీశా అంజిరెడ్డి, పల్లా రోజ్లీనా, మక్బుల్, కమర్తపు మురళి, గోళ్ల చంద్రకళ వెంకట్, ఫాతిమా జోహారా ముక్తార్, షౌకత్ అలీ, మడూరి ప్రసాదరావు, దాదే అమృతమ్మ, కర్నాటి కృష్ణ, పాకాలపాటి విజయలక్ష్మి, బీజీ క్లెయిమెంట్, పాలెపు విజయ వెంకటరమణ, బుడిగెం శ్రీనివాసరావు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, శీలంశెట్టి రమ, బుర్రి వెంకట్‌కుమార్, పగడాల శ్రీవిద్య, మిక్కిలినేని పైడిపల్లి రోహిణి, శ్రావణి, దోరేపల్లి శ్వేత పాల్గొన్నారు.
నేడూ కొనసాగనున్న చెక్కుల పంపిణీ..
కల్యాణలక్ష్మి,సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఖమ్మంలో మంగళవారమూ కొనసాగనుంది.
బుల్లెట్టు బండెక్కి..
నగరంలో బుల్లెట్టు బండిపై పర్యటించారు మంత్రి అజయ్‌కుమార్. దీంతో సందడి వాతావరణం నెలకొంది. 223 మంది లబ్ధిదారులకు రూ.2.23 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 351 మందికి రూ.1.45 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. వీటిని సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పంపిణీ చేయనున్నారు.