చిక్కడపల్లి : ఎర్ర ఉపాళి గొప్ప వాగ్గేయకారుడని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. బహుజన సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఉపాళీయం’’ ఎర్ర ఉపాళి పాటలు రచయిత డప్పోల్ల రమేశ్ రచించిన పుస్తకాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆవిష్కరించి ప్రసంగించారు.
డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ముప్పారం ప్రకాశం, మాస్టార్జీ , గుడిపల్లి నిరంజన్, దున్న యాదగిరి, చిలుక భాస్కర్, నలిగంటి శరత్, గుడిపల్లి రవి, పొన్నాయిల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.