
చేగుంట,డిసెంబర్30: ఉపాధిహామీ పనుల రికార్డులు సక్రమంగా లేకంటే చర్యలు తప్పవని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ అ న్నారు. మండల పరిధిలోని వడియారం, పోతాన్‌పల్లి, పోతాన్ శెట్టిపల్లి, పెద్దశివునూర్లో ఏర్పాటు చేసిన నర్సరీలను గు రువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఉపాధిహామీ పనులను సంబంధించిన రికార్డులు తప్పని స రిగా ఉండాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం,వస్తువుల కొనుగోలు, మొక్కలకు వేసే ఎరువుల తయారీ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలోఎంపీడీవో ఉమాదేవి, ఎం పీ వో ప్రశాంత్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏపీఎం సంతోశ్, సర్పం చ్ వడ్డెపల్లి తిరుమల, నెల్లూర్, ఎంపీటీసీ బక్కి లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ టీఏలు తదితరులున్నారు.
మల్కాపూర్‌లో డీఎల్పీవో పర్యటన
తూప్రాన్ రూరల్, డిసెంబర్ 30: తూప్రాన్ మండలంలోని ఆదర్శగ్రామమైన మల్కాపూర్‌ను డీఎల్పీవో వరలక్ష్మి తనిఖీ చేశా రు. తడి , పొడి చెత్త సేకరణ, పారిశుధ్యం,ఎవెన్యూ ప్లాం టేషన్ ,డంపింగ్ యార్డు, వైకుంఠధామం,పల్లె ప్రకృతివనం, నర్సరీలను పరిశీలించారు, ప్రభుత్వ పాఠశాలను,అంగన్వా డీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థ్దులతో ముచ్చటించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవీ నవీన్, పంచాయతీ పాలక వర్గ సభ్యులు ఆంజనేయులుగౌడ్, పంచాయతీ సెక్రెటరీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు
నర్సరీలో మొక్కలను సిద్ధంగా ఉంచాలి
మెదక్‌రూరల్, డిసెంబర్ 30: హరితహార కార్యక్రమానికి నర్సరీల్లో అన్నిరకాల మొక్కలను సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. మెదక్ మండల పరిధిలోని బాలనగర్‌లోని నర్స రీ నిర్వహణ పనులను, పల్లె ప్రకృతి వనాన్ని , పారిశుధ్య పనులు, అభివృద్ధ్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీరాములు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో 22 లక్షల 49 వేలు మొక్కలు హరితహారానికి సిద్ధం చేస్తున్నామన్నారు. మొక్కల పెంపకంలో తప్పకు ం డా సాంకేతిక ప్రమాణాలు పాటించాలని సూ చించారు. నర్సరీ నిర్వహణ పనులను సక్రమం గా చేయాలని వన సేవకులకు సూచించారు. గ్రామంలో నిత్యం సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి గ్రామాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వికాస్, పంచాయతీ కార్యదర్శి మల్లేశం ఉన్నారు.