
మక్తల్ రూరల్, డిసెంబర్19: పడమటి ఆంజనేయస్వామి తమ ఇంటి దేవుడని, అంజన్న సేవలో తాను పాల్గొన డం పూర్వజన్మ సుకృతమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట ్టణంలో జ రు గుతున్న పడమటి అంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిం చారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఎమ్మెల్యేను ఆశీర్వదించా రు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో అధికారు లతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పడమటి అంజనేయస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధ్ది చెందిందన్నారు. ఈప్రాంత ప్రజల ఇలవేల్పు అయిన అంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు, ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకా రం వంశపారంపర్య ధర్మకర్త భీమాచార్య, ఆలయ ఈవో సత్యనారాయణ, కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహాగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మాగనూర్ మండల కమిటీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టు వస్ర్తాలు సమర్పణ
పట్టణంలో పడమటి అంజనేయస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావని పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు చైర్ పర్సన్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజయ్య , కౌన్సిలర్లు కౌసల్య, కర్ని లక్ష్మి, సత్యనారాయణ, ప్రసన్నారెడ్డి, కాచ్వార్ ఎంపీటీసీ బలరాంరెడ్డి పాల్గొన్నారు.
స్వామివారి సేవలో జెడ్పీ చైర్పర్సన్
మక్తల్ పట్టణంలో కొలువుదీరిన పడమటి అంజనేయస్వామివారిని ఆదివారం నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజగౌడ్ దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్భంగా ఆల య అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశ్వీర్వచనం చేశారు. అలాగే డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా, పాటు మక్తల్ ఎంపీపీ వనజ, పస్పుల సర్పంచ్ దత్తప్ప, టీ ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు అంజనేయులుగౌడ్, మండల కమిటీ అధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి ,టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధానకార్యదర్శి తాయప్ప, బీజీపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి జెడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ
ఊట్కూర్, డిసెంబర్19: మండలంలోని పులిమామిడి గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. గ్రామంలో అయ్యప్ప ఆలయ నిర్మా ణం చేపట్టేందుకు స్థల మంజూరు కోరుతూ వారం కిందట అఖిల భారత అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఆయన స్థానిక బీసీ కాలనీ, ప్రకృతి వనం పక్కన సర్వే నంబర్ 279లో 300 గజాల స్థలాన్ని గుడి నిర్మాణం కోసం సర్వే చేయించి అనుమతించడంతో పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు అయ్యప్ప దీక్షా సేవా స మితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, మాజీ విండో అధ్యక్షుడు సంజన్న, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రామారెడ్డి, సేవాసమితి అద్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, రాముగౌడ్, కార్తీక్‌గౌడ్, చెన్నకేశవులు, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.