
గుండాల, డిసెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం అందించిన క్రిస్మస్ దుస్తులను ఇన్చార్జి తాసీల్దార్ శ్రీనివాస్ గురువారం క్రైస్తవులకు అందజేశారు. మండల వ్యాప్తంగా 95 మంది పేద క్రైస్తవులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఖలీల్, శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, క్రైస్తవులు పాల్గొన్నారు.
రాజాపేటలో క్రిస్మస్ వేడుకలు
రాజాపేట, డిసెంబర్ 23 : మండల కేంద్రంలోని చెల్మిడి ఫంక్షన్ హాల్లో గురువారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కానుకలను పేద క్రైస్తవులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, తాసీల్దార్ జయమ్మ, పాస్టర్లు గందేటి పాల్‌రెడ్డి, పశుపతి పాల్గొన్నారు.
జాల గ్రామంలో..
రాజాపేట మండలం జాల గ్రామంలోని సెయింట్ జెకారియా పాఠశాలలో గ్రామానికి చెందిన 80 మంది పేదలకు సర్పంచ్ గుంటి మధుసూదన్‌రెడ్డి గురువారం చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీరెలు అందజేసిన పాఠశాల కరస్పాండెంట్ గొల్లపల్లి జాన్ బిషఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కిస్టోఫర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నూతి రమేశ్ క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, తాసీల్దార్ నాగలక్ష్మి, సర్పంచ్ బోళ్ల లలిత, ఎంపీటీసీలు, చర్చి ఫాదర్ పరిశుద్ధరావు, క్రైస్తవులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో..
చౌటుప్పల్ : అందరికీ ఆదర్శప్రాయుడు ఏసుక్రీస్తు అని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. స్థానిక అన్నా మెమోరియల్ పాఠశాలలో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు : మున్సిపాలిటీ కేంద్రంలోని సెక్రేడ్ హార్ట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ తానయ్య కేక్ కట్ చేసి చిన్నారులకు పంచారు. ఈ సందర్భంగా విద్యారుల నృత్యాలు అలరించాయి. ఫాదర్ ఆంథోని, ఉపాధ్యాయులు ఎల్సిమ్యాత్, ఫాతిమా, లక్ష్మీభవాని, రాణి, మేరి, కృష్ణ, మల్లేశ్, సత్యం, కృష్ణారావు, శివ, భాస్కర్ పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ జ్యోతి క్రిస్మస్ కానుకలు అందజేశారు. బ్లేస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోగులగుట్ట తండా, మాధపూర్‌లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్‌నాయక్, బాప్టిస్ట్ చర్చి సౌత్ లాలాగూడ ప్రెసిడెంట్ కమలాకర్, టీచర్లు సునీత, సంధ్యారాణి, పాస్టర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురంలో..
సంస్థాన్ నారాయణపురం : తాసీల్దార్ కార్యాలయంలో 165 మంది క్రైస్తవులకు ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ క్రిస్మస్ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, సర్పంచులు యాదయ్యగౌడ్, భాస్కర్, భిక్షపతి, యాదవరెడ్డి, ఆర్ఐ నగేశ్ పాల్గొన్నారు.