వ్యాక్సిన్‌తోనే రక్షణ …
కొండాపూర్ :వ్యాక్సిన్‌తోనే కొవిడ్ మహమ్మారీ నుంచి రక్షణ పొందుతామని శేరిలింగంపల్లి సర్కిల్ -20 ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి అన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బీ బ్లాక్‌లో రెండవ రోజు డ్రైవ్‌ను కొనసాగిస్తున్నామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేయించుకోవాల్సిందిగా తెలిపారు. కొవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నదని, మరోసారి ప్రమాదపుటంచుల్లోకి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కొనసాగిస్తుందన్నారు. వ్యాక్సిన్ల కోసం దవాఖానల్లో ఇబ్బందులు పడకుండా నివాస కాలనీల్లోనే ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు.
ఇజ్జత్ నగర్ కాలనీలో ….
మాదాపూర్: కరోనా ఉదృతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ నేఫథ్యంలో బుధవారం మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్ కాలనీలో మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చుట్టు ప్రక్కల కాలనీ ప్రజలు టీకాలను వేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకే రోజులో 330 కి పైగా కాలనీ ప్రజలకు వైద్య సిబ్బంది జీహెచ్ఎంసి అధికారుల సమక్షంలో టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తీక్, జీహెచ్ఎంసి ఎస్ఆర్పి శ్రీనివాస్‌రెడ్డి, కాలనీ వార్డు సభ్యులు రాంచెందర్లు పాల్గొన్నారు.
వాక్సిన్‌పై అనుమానాలు వద్దు
శేరిలింగంపల్లి:వాక్సినేషన్‌పై అనుమానాలు వద్దని, అందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. బుదవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెబైల్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అందరూ వాక్సిన్ వేసుకోవాలనే సదుద్ధేశ్యంతో మెబైల్ వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగు తుంద ని అన్నారు. తమ కాలనీల్లో అందుబాటులో ఉన్న ఆయా కేంద్రాల్లో వాక్సిన్ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేశవ్‌నగర్ కాలనీ నాయకులు తిరుపతి, హరీష్ శంకర్, కిషన్, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.