బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో కమ్యూనిటీహాల్‌ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం ప్రారంభించారు. చాలా కాలం క్రితమే ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయినప్పటికీ కొంతభాగం అసంపూర్తిగా ఉండడంతో స్థానికులు ఉపయోగించుకోలేకపోయారు.
దీంతో ఈ పెండింగ్ పనులను పూర్తిచేయాలని స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కోరడంతో ఇటీవల నిధులు మంజూర య్యాయి. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో నివాసం ఉంటున్న వారి సౌకర్యం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కొత్త కమ్యూనిటీహాళ్ల నిర్మాణం చేయడంతో పాటు పాత వాటిలో సమస్యలను పరిష్కరించేందుకు మరమ్మతులు చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.