కవాడిగూడ : సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్‌పూర్ డివిజన్లోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీప్ ఫండ్ కింద మంజూరి చేసిన రూ. 4,60,500 చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ పండ్ కింద 13 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసినట్లు ఆయన తెలిపారు. డి. వెంకట్-27 వేలు, సీహెచ్ శకుంతల-58 వేలు, అతీషాబేగం-50 వేలు, పోచమ్మ-24 వేలు, మహ్మద్ జకిరియా-38 వేలు, పి. సులోచన-60 వేలు, ఉతీషా బేగం-60 వేలు అందజేశారు.
అలాగే మహ్మద్ మెహతాబ్ అలీ-48 వేలు, మహ్మద్ ముజోమిల్-29 వేలు, ఎండీ. ఫారూఖ్-29 వేలు, ముజాహిత్ స్సేన్-14 వేలు, ఎండీ. జాఫర్ అలీ-12 వేలు, శివకుమార్-11,500 చొప్పున చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్‌కుమార్, రాష్ట్ర మాజీ కార్యదర్ళి మహ్మద్ షరీపోద్దీన్, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.