
నారాయణఖేడ్, జనవరి 9 : రైతు సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ రైతుల ఆత్మబంధువుగా మారారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కొనియాడారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణఖేడ్‌లో ముగ్గుల పోటీలతో పాటు వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018 సం వత్సరంలో ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేలు పెట్టుబడి సాయం అందజేస్తు న్నట్లు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రభుత్వం రూ.200 కోట్ల పైచిలుకు పెట్టుబడి సాయం అందజేస్తుంన్నదన్నారు. సీఎం కేసీఆర్ ఖేడ్ నియోజకవర్గంలోని 1.35 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ. 1,377 కోట్ల నిధులతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకుంటు న్నారన్నారు.
ఆకట్టుకున్న ముగ్గులు
నారాయణఖేడ్ తహసీల్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన పలు ముగ్గులు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో పాటు సంక్షేమ పథకాలను ఆవిష్కరించాయి. ముగ్గుల పోటీలతో పాటు చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, ఆత్మచైర్మన్ రాంసింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, పీడీపీవో సుజాత, ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.